English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మరో అడ్డంకి !

Election commission  shocks to Lakshmi's NTR
2019-03-25 11:07:46

అనుకుంటున్నట్టుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నెల 29వ తేదీన ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా తాజాగా ఈ సినిమాకి మరో అవాంతరం ఎదురైంది. ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ ఈ సినిమా ఉండనుందని వార్తలు రావడంతో పటు వర్మ కూడా వెన్నుపోటు అంటూ ప్రచారం చేయడంతో ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసేంత వరకు ఈ చిత్ర విడుదలను ఆపేయాలని శ్రీకాళహస్తికి చెందిన మోహన్ రావు అనే వ్యక్తి తాజాగా ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో, 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రాన్ని తమకు చూపించాలంటూ నిర్మాత రాకేష్ రెడ్డిని ఎన్నికల కమిషన్ ఆదేశించింది.ఈ నేపథ్యంలో, ఈరోజు ఎన్నికల సంఘం ముందుకు రాకేష్ రెడ్డి హాజరుకానున్నారు. ఒక వేళ ఆయన సమాధానంతో ఈసీ సంతృప్తి చెందకపోతే ప్రివ్యూ, ఫిల్మ్ సర్టిఫికేషన్‌లో ఈసీని భాగం చేయాలని ఆదేశించే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Related Stories