English   

నయనతారని చూసి దెయ్యాలు కూడా పారిపోతాయట...సీనియర్ నటుడు అనుచిత వ్యాఖ్యలు !

Radha Ravi slut shames Nayanthara on stage
2019-03-25 12:23:14

తమిళ బేస్డ్ హీరోయిన్ నయనతార మీద ప్రముఖ నటుడు రాధా రవి చేసిన వ్యాఖలు కలకలం రేపుతున్నాయి. తాజాగా నయనతార నటించిన ‘కోళయుథిర్ కాలం’ అనే సినిమా ప్రమోషనల్ ఈవెంట్ ని చెన్నైలో నిర్వహించారు. నిజానికి ఈ సినిమా షూట్ మధ్యలోనే ఆగిపోయింది. ఆ సినిమా నిర్మాత, దర్శకుడు ఈ ప్రాజెక్ట్‌ను నుంచి డ్రాప్ ఔట్ అయ్యారు. ఎలాగోలా పూర్తి చేసిన ఈ సినిమా ట్రైలర్ ని ఈ ఈవెంట్ లో రిలీజ్ చేశారు, ఈ ఈవంట్ కి రాధారవి ముఖ్యఅతిథిగా విచ్చేసారు. ఆయన స్టేజ్‌పై ప్రసంగిస్తూన్న సమయంలో నయన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. నయనతారను అందరు లేడీ సూపర్ స్టార్ అంటారు. అంతేకాదు అందరు ఆమెను ఎంజీఆర్,శివాజీ గణేషన్‌లతో సమానంగా చూస్తారు. ఎంజీఆర్,శివాజీ గణేషన్ చాలా గొప్పవాళ్లు. అలాంటి వాళ్లతో నయనతారను పోలుస్తున్నందకు చాలా బాధగా ఉందన్నారు. ఒకప్పుడు సినిమాల్లో దేవతా పాత్రలు అంటే కే.ఆర్.విజయనే సంప్రదించే వారు. కానీ ఇపుడు దెయ్యాల పాత్రలంటే నయనతారనే సంప్రదిస్తున్నారు. నయన్ ని చూసి దెయ్యాలు కూడా పారిపోతాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల మీద ఇప్పుడు కోలీవుడ్ లో దుమారం రేగుతోంది. ఈ వ్యాఖ్యల పట్ల పలువురు ప్రముఖలు ఖండిస్తున్నారు. ఈయన స్వయానా సీనియర్ హీరోయిన్ రాధికకి అన్న కావడం విశేషం.

 

More Related Stories