English   

వైసీపీలో చేరిన మోహన్ బాబు !

Telugu actor and NTR aide Mohan Babu joins YSRCP
2019-03-26 11:55:40

ప్రముఖ సినీ నటుడు, విద్యానికేతన్ విద్యా సంస్థల ఛైర్మన్ మంచు మోహన్ బాబు వైసీపీలో చేరినట్లు వార్తలు వస్తున్నాయి. మాజీ ఎంపీ, సినీనటుడు మంచు మోహన్ బాబు జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. ఇవాళ ఉదయం 10 గంటలకు లోటస్ పాండ్ కు వచ్చిన ఆయన వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్బంగా వైసీపీ గెలుపు కోసం రాష్ట్రవ్యాప్తంగా మోహన్ బాబు ప్రచారం చేయనున్నట్టు తెలుస్తోంది.  గత కొన్ని రోజులుగా తన విద్యాసంస్థలకు రావాల్సిన ఫీజు రియంబర్స్‌మెంట్‌‌ విషయమై ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుతున్నారని దొంగచాటుగా ఎందుకు వైసీపీలో జాయిన్ అయ్యి మాట్లాడొచ్చు కదా అని చురకలు కూడా అంటించింది టీడీపీ. ఈ నేపధ్యంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోవడానికి సిద్ధమయ్యారని సమాచారం.  వైఎస్ కుటుంబంతో మంచు ఫ్యామిలీకి మంచి బంధుత్వం కూడా ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల మంచు విష్ణు భార్య వెరోనికా కూడా జగన్ అన్న తన ప్రాణం అంటూ ట్విట్టర్ లో పేర్కొన్నారు.

More Related Stories