English   

యాసిడ్ బాధితురాలిగా మారిన దీపికా !

Deepika Padukone as acid attack survivor Laxmi Agarwal in Chhapaak
2019-03-26 12:24:34

ఈ మధ్య కాలంలో నటీనటులు గ్లామర్ పాత్రల కంటే నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రల్లోనే ఎక్కువగా నటించడానికి ప్రాదాన్యత ఇస్తున్నారు. రెమ్యునరేషన్ తో పాటు మంచి పేరు వస్తుందని వారు ఈ తరహా పాత్రలలలో నటించడానికే చూస్తున్నారు. తాజాగా బాలీవుడ్ రారాణి దీపికా పడుకొనే మరో చాలెంజింగ్ పాత్ర చేస్తోంది. పద్మావత్ తర్వాత దీపికా మరే సినిమా ఒప్పుకోలేదు ఆ తర్వాత ఆమె నటిస్తున్న ఛపాక్. ఈ ఛపాక్ మూవీ కోసం దీపికా యాసిడ్ బాదితురాలిగా మారిపోయింది. రాజీ మూవీ ఫేమ్ మేఘనా గుల్జార్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో దీపికా ఒక యాసిడ్ బాధితురాలి పాత్రలో కనిపిస్తున్నదని బీ టవున్ సమాచారం. లక్ష్మీ అగర్వాల్ అనే యాసిడ్ బాధితురాలి జీవిత చరిత్ర ఆధారంగా ఛపాక్ తెరకెక్కుతున్నది. ఈ మూవీకి సంబంధించి దీపికా ఫస్ట్ లుక్ తాజాగా రిలీజయ్యింది. ఈ సినిమాలో లీడ్ రోల్‌ను ప్లే చేయడంతోపాటు సినిమా నిర్మాత కూడా దీపికానే కావడం ప్రేక్షకులకి ఆసక్తికరంగా మారింది. తాజాగా బాలీవుడ్ క్రిటిక్ రమేష్ బాలా ఈ ఫస్ట్ లుక్‌ను ట్విటర్‌లో షేర్ చేశాడు. ఆ తర్వాత దీపికా కూడా ఇదే ఫస్ట్ లుక్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. వచ్చే ఏడాది జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కానున్నట్లు దీపికా వెల్లడించింది.

More Related Stories