English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి తొలగిన బాలారిష్టాలు !

RGV announces March 29 as release date of Lakshmi's NTR
2019-03-26 12:58:08

గత కొన్ని రోజులుగా వివాదాల్లో చిక్కుకుని రిలీజ్ అవుతుందా లేదా అని ఊగిసలాట ధోరణిలో ఉన్న వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలకు ఎట్టకేలకు అడ్డంకులు తొలిగాయి. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాతలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తొలుత 22న విడుదల కావలసిన సినిమా సెన్సార్ కాకపోవడం వలన మార్చి 29కి వాయిదా పడింది. అయితే తాజాగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు అందడంతో మళ్ళీ సినిమా విడుదల మీద నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే నిన్న ఎన్నికల్ సంఘం ముందు ఆయన వ్యక్తిగతంగా హాజరు కావడం ఆయన ఇచ్చిన సమాధానాలకు ఎన్నికల సంఘం సంతృప్తి పడడంతో ఎట్టకేలకు సినిమా రిలీజ్ కానుంది. సినిమాలో ఉన్న సీన్లు, డైలాగ్స్ ఎన్నికల కోడ్ పరిమితికి లోబడే ఉన్నట్లు జారీ అయిన మానిటరింగ్ కమిటీ మీడియా సర్టిఫికేషన్ ను నిర్మాత రాకేశ్ రెడ్డి ఈసీకి సమర్పించారు. పరిశీలించిన ఈసీ సినిమా విడుదలైన తర్వాత ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా ఈసీ ఎదుట హాజరవ్వాలని చెప్పారని సమాచారం. మరో ఆసక్తికర అంశం ఏంటంటే ఈ సినిమా లక్ష్మీపార్వతి రాసిన పుస్తకం ఆధారంగా తెరకెక్కించినట్లు ఆయన ఈసీకి తెలిపారట.

More Related Stories