English   

మోహన్ బాబుతో బాబు మీద భేటీ...గుబులు రేపుతున్న వర్మ !

Mohan Babu Meet Ram Gopal Varma About Lakshmi's Ntr Movie
2019-03-26 13:37:29

ఎన్నికల పుణ్యమా అంటూ ఆంధ్రప్రదేశ్‌లో అసలు జరుగుతాయో లేదో అనుకున్నవన్నీ చూస్తున్నాం. ఏపీలో బాబుని టార్గెట్ చేసిన వర్మ వెన్నుపోటు అంటూ ‘లక్షీస్ ఎన్టీఆర్’ సినిమాతో ఎన్నికల ముందు హీట్ పెంచేశారు. అనేక వాయిదాల అనంతరం ఈ సినిమా విడుదలకు రెడీ అయ్యింది. మరోపక్క మోహన్ బాబు ఫీజురీయింబర్స్ మెంట్ అంటూ విద్యార్ధులతో కలిసి భారీ ధర్నా నిర్వహించి చంద్రబాబుని ఆయన ప్రభుత్వాన్ని టెన్షన్ లో పెట్టె ప్రయత్నం చేశారు. ఇలా మోహన్ బాబు, వర్మలు ఎన్నికలకు ముందు చంద్రబాబుకి తలనొప్పిగా మారారు. అయితే ఈ ఇద్దరూ ఒకే చోట కలుసుకోవడం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. నిన్న రాత్రి మోహన్ బాబుతో భేటీ అయిన ఫొటోని షేర్ చేసి టీడీపీ వారిని టెన్షన్ లోకి నెట్టారు ఆర్జీవీ. సీరియస్‌ గా ఏదో మ్యాటర్ మాట్లాడుతున్నట్టు ఉన్న ఫొటోని షేర్ చేస్తూ.. ‘చంద్రబాబు ఇలా అని నేను ఎప్పుడూ అనుకోలేదు’.. అంటూ ఆశ్చర్యం, కోపం ప్రతిభిమ్భించే ఎమోజీలను పోస్ట్ చేసిన వర్మ.. f...k, b...d అని అసంపూర్ణమైన అర్ధాలతో ఖాళీలను మీకు ఇష్టమైన పదాలతో పూరించుకోండి అన్నట్టుగా వదిలేశారు. మొత్తానికి సినిమా ప్రమోషన్ కి పనికొచ్చే ఏ అంశాన్ని వర్మ వదలుకోవడం లేదు.

More Related Stories