English   

కుర్ర హీరోతో పోటీకి దిగిన సూర్య !

Surya Selvaraghavan's NGK movie releasing on may 31st
2019-03-26 14:31:27

త‌మిళ స్టార్ హీరో సూర్య‌కి తెలుగులోను మంచి ప్రత్యేక హ్యూజ్ ఫ్యాన్ బేస్ ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆయ‌న న‌టించిన సినిమాలు దాదాపు అన్నీ అటు త‌మిళం, ఇటు తెలుగులో రెండు బాశాల్లోను విడుద‌ల‌వుతూ ఉంటాయి. ఒకరకంగా ఆయన మురగదాస్ గజినీ సినిమాతో తెలుగు ప్రేకషకుల మనస్సులో చెరగని వేసుకున్నారు. అయితే సూర్య తాజా మూవీ ఎన్‌జీకే( నంద గోపాల‌న్ కుమార‌న్‌). సెల్వ‌రాఘ‌వ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా టీజ‌ర్స్, సాంగ్స్ ఈ మధ్యనే రిలీజయి ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో అల‌రించాయి. ఈ సినిమా పొలిటికల్ డ్రామా నేపధ్యంలో తెరకెక్కింది. అయితే ఈ సినిమా రిలీజ్ పట్ల చాలా రోజుల నుండి ఊగిసలాట ధోరణితో వ్యవరిస్తున్నారు మేకర్స్. ఎన్నికల సీజన్ కావడంతో సినిమా ఎప్పుడు రిలీజ్ చేయాలో అనేక చర్చల తర్వాత ఈ సినిమా రిలీజ్ మీద క్లారిటీ ఇచ్చింది ఈ యూనిట్. మే 31న ఎన్‌జీకే చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించింది ఈ సినిమా యూనిట్. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఎంటటే అదే రోజు విజ‌య్ దేవ‌ర‌కొండ డియ‌ర్ కామ్రేడ్ చిత్రం కూడా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా కూడా ఈసారి తెలుగు, కన్నడ, తమిళ, మళయాళ బాషలలో కూడా తెరకెక్కుతోంది. మరి ఈ రెండు సినిమాలు ఓకే రాజు రిలీజ్ అవుతుండడంతో సూర్య ఏంటి కుర్ర హీరోతో పోటీ పడుతున్నాడు అని ప్రేక్షకులు చర్చించుకుంటున్నారు.

More Related Stories