English   

సెన్సార్ పూర్తి చేసుకున్న 'సూర్యకాంతం'

Suryakantham Completes Censor Formalities
2019-03-27 03:28:41

గతేడాది ఎమ్మెస్ రాజు కొడుకుతో కలిసి చేసిన హ్యాపీ వెడ్డింగ్‌ సినిమా అంతగా కలిసిరాకపోవడంతో మరోసారి సక్సెస్‌ కోసం ప్రయత్నిస్తూ రాహుల్‌ విజయ్‌తో కలిసి ‘సూర్యకాంతం’గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది మెగా డాటర్ నిహారిక.  విజయ్‌ దేవరకొండ లాంటి క్రేజీ స్టార్‌ను ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ఆహ్వానించి మంచి బజ్‌ ని క్రియేట్ చేసుకుంది ‘సూర్యకాంతం’ మూవీ. సినిమా రిలీజ్ దగ్గరపదడంతో ప్రమోషన్ కార్యక్రమాలు వేగవంతం చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగా నిన్న ట్రైలర్ రిలీజ్ చేసింది సినిమా యూనిట్. ఈ ట్రైలర్ సినిమా మీద అంచనాలను పెంచుతోంది. ట్రైలర్‌ మంచి స్పందనను కూడా రాబట్టుకుంటోంది. ఇక ఈ సినిమాకు సంబంధించి తాజాగా సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయని సినిమా యూనిట్ ప్రకటించింది. ఇక నీహారిక అన్న వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ ఈచిత్రాన్ని నిర్మించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇక సెన్సార్ సభ్యుల నుంచి క్లీన్ యు సర్టిఫికెట్‌ను పొందిన ఈ చిత్రాన్ని మార్చి 29న భారీగా విడుదల చేయబోతున్నారు. అయితే అదే రోజు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కూడా ఉండడంతో ఎమేరకు పోటీలో ఉంటుందో చూడాలి మరి.

More Related Stories