English   

సూర్యకాంతం ట్రైలర్ టాక్...వామ్మో నిహారిక !

Niharika Rahul Vijay Suryakantam Trailer
2019-03-27 03:40:01

నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన ‘సూర్యకాంతం’ మూవీ మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న నేపధ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ ని వేగవంతం చేసింది సినిమా యూనిట్. అందులో భాగంగా నిన్న ట్రైలర్ రిలీజ్ చేశారు. నిమిషం 50 సెకన్లున్న ఈ ట్రైలర్ లో ‘నా పేరు అభి.. నా జీవితంలో ఓ సంఘటన జరిగింది..’ అంటూ హీరో వర్షన్ తో ఈ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. నాకు ఇండైరెక్ట్ గా ప్రపోజ్‌ చేశావ్‌ ఎదవా అని హీరోని తిట్ట్టిన నిహారిక, తర్వాత అతనితోనే  ఫోన్‌ మాట్లాడుతూ కనిపించింది.

 

ఈ ట్రైలర్ ని బట్టి చూస్తే ఇద్దరమ్మాయిల మధ్యలో నలిగే యువకుడిగా రాహుల్‌ విజయ్‌, సాఫ్ట్‌ గర్ల్‌‌గా బిసానియా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటుందో తెలియని భిన్న స్వభావం ఉండే క్యారెక్టర్‌ లో నిహారిక నటించినట్లు తెలుస్తోంది. అన్ని అంశాల మేళవింపుతో ‘సూర్యకాంతం’ ఈసారి హిట్ కొట్టేట్టు కనిపిస్తుంది. చివర్లో మిడిల్ ఫింగర్‌ చూపిస్తూ వామ్మో అనిపించింది నిహారిక.  మార్క్‌ కె రూబిన్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాకి ‘ముద్దపప్పు ఆవకాయ్‌’ వెబ్‌సిరీస్‌ ఫేమ్‌ ప్రణీత్‌ బ్రహ్మాండపల్లి  దర్శకత్వం వహిస్తున్నారు. ట్రైలర్‌పై మీరూ ఓ లుక్కేయండి. 

More Related Stories