English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ సెన్సార్ టాక్...అంత లేదా ?

Lakshmis-NTR
2019-03-27 05:23:56

అనేక వివాదాల నడుమ, ఇక రిలీజ్ అవుతుందా లేదా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ మూవీ సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. అనేక మార్లు వాయిదా తర్వాత ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ జీవితంలోని చీకటి కోణాన్ని ఆవిష్కరిస్తూ ఈ చిత్రాన్ని రూపొందించానని వర్మ చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిలాకి చెందిన రంగస్థల నటుడు పి.విజయ్‌కుమార్‌, యజ్ఞశెట్టి, శ్రీతేజ్‌ ప్రధాన పాత్రధారులుగా రాంగోపాల్‌వర్మ-ఆగస్త్య మంజుల దర్శకత్వంలో రాకేష్‌రెడ్డి, దీప్తి బాలగిరి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఎన్నికల సమయంలో ఈ చిత్రం విడుదలవుతుండటంతో ఇందులో వివాదస్పద అంశాలున్నాయంటూ ఫిర్యాదులు వెల్లువలా పుట్టుకొచ్చాయి. ఆఖరికి ఎన్నికల కమీషన్‌కు కూడా ఫిర్యాదులు అందడంతో నిర్మాత రాకేష్‌రెడ్డి సినిమా గురించి వివరణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో  ఈ సినిమాకు సెన్సార్ బోర్డు ఊహించని విధంగా ‘క్లీన్స యూ సర్టిఫికెట్’ ను ఇచ్చింది. నిజానికి ఎప్పుడూ వర్మ సినిమాలకు యూ సర్దిఫికేట్స్ రావు. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఊహించని విధంగా యూ సర్టిఫికెట్ వచ్చింది. దీంతో వర్మ కెరియర్ లో ఇదో స్పెషల్ మూవీ అనొచ్చేమో. అలాగే సెన్సార్ వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చారంటే వర్మ పెద్దగా వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళలేదేమో అని కూడా కొందరు భావిస్తున్నారు. అలాగే కెనడా, అమెరికా వాళ్ళకి అయితే సెన్సార్ చేయని వర్షన్ అందుబాటులో ఉంటుందని కూడా వర్మ ప్రకటించారు, ఇక యూఎస్ లో ఒకరోజు ముందు నుండే ప్రీమియర్స్ పడనున్నాయి.

More Related Stories