English   

గోవాలో ప్యాకప్ చెప్పేశారు !

iSmart-Shankar
2019-03-27 05:40:44

ఈ మధ్య కాలంలో హిట్స్ లేక ఇబ్బంది పడుతున్న రామ్ డైరెక్టర్ పూరీలు ఇద్దరూ కలిసి 'ఇస్మార్ట్ శంకర్' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నభ నటేష్, నిధి అగర్వాల్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను మేలో విడుదల చేయాలని దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. అందుకే షూట్ అంత వేగంగా కానిస్తున్నారు. గత కొంత కాలంగా ఈ సినిమాకి సంబంధించి ఒక షెడ్యూల్ షూటింగ్ గోవాలో జరుగుతోంది. అక్కడ కొన్ని ప్రదేశాలలో యూనిట్ కీలకమైన సన్నివేశాలను షూట్ చేసిందట. అందుతున్న తాజా సమాచారం ప్రకారం గోవాలోని ఈ కీలకమైన షెడ్యూల్ నిన్నటితో పూర్తయింది. హీరో, ఇద్దరు హీరోయిన్లు కూడా ఈ గోవా షెడ్యూల్ లో పాల్గొన్నారు. ఈ షెడ్యూల్ పూర్తి కావడంతో సినిమా షూటింగ్ 60 శాతం పూర్తి అయినట్లేనని పూరీ సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం. ఈ సందర్భంగా చిత్ర బృందం పార్టీ కూడా చేసుకున్నారట. ఈ సినిమాలో రామ్ సరికొత్త లుక్ లో అవతారంలో కనిపించనున్నాడు. ఆ విషయం చిత్ర పోస్టర్స్ ను చూస్తేనే అర్థమైపోతోంది. ఇక ఈ సినిమా తదుపరి షెడ్యూల్ త్వరలో మొదలు కానుందని చెబుతున్నారు. 

More Related Stories