English   

మ‌హ‌ర్షి తొలి పాట వ‌చ్చేస్తుంది.. మ‌హేష్ బాబుకు బాగా ఇష్ట‌మ‌ట‌.. 

Mahesh
2019-03-27 09:44:28

మహర్షి తొలి పాట విడుదల కావడానికి సమయం ఆసన్నమైంది. మార్చి 29న‌ మహర్షి సినిమా లోని తొలి పాట వ‌స్తుంది. ఈ మేరకు మహేష్ బాబు దీనిపై క్లారిటీ కూడా ఇచ్చాడు కూడా. ఇక ఇప్పుడు పోస్టర్ కూడా విడుదల అయింది. అల్లరి నరేష్, పూజా హెగ్డే, మహేష్ బాబు సముద్రం ముందు నిలబడి ఉన్న ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఇందులో మహేష్ బాబు సాఫ్ట్ వేర్ కంపెనీ సీఈవోగా నటిస్తున్నాడు. అల్లరి నరేష్ ఆయన స్నేహితుడిగా కనిపిస్తున్నాడు. శ్రీ కృష్ణుడు, కుచేలుడు కథను ఆధారంగా చేసుకొని మహర్షి సినిమా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. దాంతో పాటు ఈ సినిమాలో షారుక్ ఖాన్ నటించిన స్వదేశ్ సినిమా ఛాయలు కూడా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రైతులు, వాళ్లు పడే బాధల నేపథ్యంలో మహర్షి సినిమా కథ వంశీ పైడిపల్లి అల్లుకున్నాడు. ఈ సినిమా కచ్చితంగా అందరినీ కదిలిస్తుందని.. థియేటర్ నుంచి బయటికి వచ్చేటప్పుడు కచ్చితంగా కన్నీళ్లు పెట్టుకుని వస్తారు అంటున్నాడు నిర్మాత దిల్ రాజు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. విడుదల తేదీ దగ్గర పడటంతో ప్రమోషన్ కూడా మొద‌లు పెట్టాడు సూపర్ స్టార్. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. నేనొక్కడినే, శ్రీమంతుడు లాంటి సినిమాల తర్వాత దేవి శ్రీ ప్రసాద్, మహేష్ బాబు కలిసి పని చేస్తున్న సినిమా ఇది. కచ్చితంగా ఈ సినిమాతో సంచలన విజయం అందుకుంటాన‌ని ధీమాగా చెబుతున్నాడు మహేష్ బాబు. పైగా 25వ సినిమా కావడంతో మహర్షిపై ప్రత్యేకంగా ప్రేమ చూపిస్తున్నాడు ఈయన.

More Related Stories