English   

జ‌గ‌న్ పార్టీలో మోహ‌న్ బాబు అందుకే చేరిపోయాడా..?

Mohan-Babu
2019-03-27 10:16:56

మోహన్ బాబు తెలుగుదేశంపై పగ తీర్చుకోవడానికే ఇప్పుడు జగన్ పార్టీలో చేరాడ‌నే వార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇన్ని రోజులు చంద్రబాబు నాయుడుతో మాటల యుద్ధం అనధికారికంగా జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం అఫీషియల్ గా ఒకరినొకరు విమర్శించుకునే స్థాయికి వెళ్లిపోయారు ఈ ఇద్దరు. పైగా ఇప్పుడు జగన్ పార్టీలో మోహన్ బాబు చేరిపోవడంతో కచ్చితంగా ఇది తెలుగుదేశంపై పగ తీర్చుకోవడానికి అనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఏదైనా చంద్రబాబు నాయుడిని మోహన్ బాబు విమర్శించవచ్చు. ఏం చేసినా అది అఫీషియల్. ఎందుకంటే ఇద్దరు వేరు వేరు పార్టీలో ఉంటారు కాబ‌ట్టి. పైగా శత్రుత్వం ఉన్న పార్టీలు. అందుకే చంద్రబాబు నాయుడుపై విమర్శల వర్షం కురిపించడానికే ఇప్పుడు జగన్ పార్టీలో మోహన్ బాబు చేరాడని.. ఇప్పటి నుంచి కేవలం ఏపీ ముఖ్యమంత్రిని విమర్శించడమే ఈయన పెట్టుకున్న పని అని తెలుస్తోంది. అయితే ఆ పార్టీలో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటికే ఎమ్మెల్యే టికెట్లు అందరికీ ఇచ్చేసాడు జగన్. మోహ‌న్ బాబును జ‌గ‌న్ ఎంపి చేస్తాడనే ఒక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇప్పటికే ఒకసారి రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు మోహన్ బాబు. ఇప్పుడు మరోసారి అదే చేయబోతున్నాడని తెలుస్తోంది. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు బయటకు రానున్నాయి. ఏదేమైనా ప్రస్తుతం రాజకీయాల్లో మరోసారి బిజీ కావాలని చూస్తున్నాడు కలెక్షన్ కింగ్.

More Related Stories