English   

మెగా హీరో సాయి ధ‌ర‌మ్ తేజ్ కోసం వ‌స్తున్న యంగ్ టైగ‌ర్..

JR-NTR
2019-03-27 10:30:40

మధ్య మెగా హీరోలు కెమెరా ముందుకు రావడం పూర్తిగా తగ్గించేశారు. ఎప్పుడు కెమెరా ముందుకు వచ్చినా కూడా మరో ప్రశ్నే లేనట్టు జనసేన గురించి మీడియా మిత్రులు అడుగుతుండడంతో వాళ్లు కూడా ఏమీ చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. పవన్ కళ్యాణ్ ను గెలిపించండి.. మార్పు కోసం ఓటేయండి అంటూ ఇప్పటికే రామ్ చరణ్ కూడా ఓపెన్ గా చెప్పేసాడు. అయితే ఎన్నికల సమయంలో ఎక్కువగా బాబాయికి ప్రచారం చేస్తుంటే అది కుటుంబ పాలన అయిపోయి ఎక్కడ ప్ర‌జ‌ల్లోకి నెగిటివ్ సంకేతాలు వెళ్తాయో అని టెన్షన్ పడుతున్నారు మెగా హీరోలు. అందుకోసమే వీలైనంత వరకు మీడియా ముందుకు రావడం.. ఆడియో వేడుకలకు.. ప్రీ రిలీజ్ వేడుకలకు వచ్చి కనిపించడం తగ్గించేసారు. ఈ మధ్య జరిగిన నిహారిక సూర్యకాంతం ప్రీ రిలీజ్ వేడుకకు కూడా విజయ్ దేవరకొండ వచ్చాడు కానీ మెగా కుటుంబం నుంచి ఎవరూ రాలేదు. ఇక ఇప్పుడు మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న చిత్ర‌ల‌హ‌రి సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు కూడా మెగా కుటుంబం నుంచి ఎవరూ రావడం లేదని తెలుస్తోంది. దానికి కారణం జనసేన పార్టీ ఎన్నికల్లో పోటీ చేస్తుండటమే. అక్కడికి చిరంజీవి, చరణ్ లలో ఎవరు వచ్చినా కూడా కచ్చితంగా మీడియా వాళ్ల‌పై స్పెషల్ ఫోకస్ పెడుతుంది. అందుకే మెగా మేనల్లుడు సినిమాకు ఎవరూ రావడం లేదు. అయితే ఈ లోటు ఎన్టీఆర్ భ‌ర్తీ చేయ‌బోతున్నాడు. పైగా మైత్రి మూవీ మేకర్స్ తో ఆయనకు మంచి మైత్రి ఉంది. జనతా గ్యారేజ్ సినిమా ఈ నిర్మాణ సంస్థ నుంచే వ‌చ్చింది. అందుకే ఇప్పుడు మెగా మేనల్లుడు సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఏప్రిల్ 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. కిషోర్ తిరుమల తెరకెక్కించిన ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. వరుసగా ఆరు పరాజయాలతో పూర్తిగా రేసులో వెనుకబడిపోయిన మెగా మేనల్లుడు.. చిత్రలహరితో విజయం అందుకని సత్తా చూపించాలని ప్రయత్నిస్తున్నాడు.

More Related Stories