English   

రజనీ సినిమా లేట్...అదే కారణమా ?

Rajinikanth
2019-03-27 10:40:01

ఇటీవ‌లి కాలంలో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ హీరోగా వచ్చిన సినిమాలు అన్నీ వరుసగా బాక్సాఫీస్ దగ్గర బోల్తా ప‌డ్డాయి. అయినా ఆయన హిట్, ఫ్లాప్ లు సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వెళ్లారు. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టి తీరాలి అనే ఊపుతో మురుగదాస్ తో మూవీని కూడా పట్టాలెక్కించాలని అనుకున్నారు. అయితే ఈ నెలలో ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు వచ్చేనెలలో 10వ తేదీ తరువాత ఈ సినిమా షూటింగును మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నారు. అయితే ఈ సినిమా ఆలస్యం కావడానికి కారణం, ఎన్నికల ఎఫెక్ట్ అని భావిస్తున్నారు. తాజా స‌మాచారం ప్ర‌కారం ఏప్రిల్ 10న ముంబైలో తొలి షెడ్యూల్ జ‌ర‌ప‌నున్నార‌ని అంటున్నారు. రెండు నెల‌లో చిత్రాన్ని పూర్తి చేయాల‌ని మురుగ‌దాస్ భావిస్తున్నాడ‌ని కోలీవుడ్ వర్గాల సమాచారం. న‌య‌న‌తార ఈ సినిమాలో క‌థానాయిక‌గా న‌టిస్తుండ‌గా, అనిరుధ్ ర‌విచంద్ర‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించ‌నుంది. ఇందులో ర‌జ‌నీకాంత్ సామాజికవేత్తగా, పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రల్లో నటించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.  

More Related Stories