English   

మరో సాహసం చేస్తున్న గోపీ చంద్ !

Gopichand
2019-03-27 11:59:01

'పంతం' సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఏడాది కావొస్తున్నా, గోపీచంద్ నుంచి ఇంతవరకూ మరో సినిమా రిలీజ్ చేయలేదు. ఆయన ప్రస్తుతం తమిళ దర్శకుడు తిరు దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్మీ బేస్డ్ సబ్జెక్ట్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన తర్వాతి సినిమా ఎవరితో ఉంటుందా అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో వారికి షాక్ ఇస్తూ అనూహ్యంగా గోపీచంద్ మరో కొత్త సినిమా ప్రారంభమయింది. ఈరోజు ప్రారంభమయిన ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ జూన్ నెలలో స్టార్ట్ చేస్తారట. ప్రముఖ దర్శకుడు సంతోష్ శివన్ వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన బిను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో భోగవల్లి ప్రసాద్ నిర్మాతగా ఈ మూవీ రూపొందనుంది. ఇక ఈ సినిమా తర్వాత సంపత్ నందితో మరో సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాడు గోపీ. భోగవల్లి ప్రసాద్, హీరో గోపీచంద్ కాంబినేషన్ లో గతంలో వచ్చిన సాహసం మూవీ మంచి విజయం సాధించింది. సాహసం మూవీ అంతా లడక్ లో జరగగా ఇప్పుడు ఈ మూవీ నేపాల్ లో తీయనున్నారని అంటున్నారు. ఇక ఈ సినిమా మొదలు అయితే అయింది కానీ ఇంకా సినిమాకి సంబంధించి మరే విషయమూ వెల్లడించలేదు. త్వరలో ఈ వివరాలు వెల్లడించనున్నారని చెబుతున్నారు. అయితే లౌక్యం సినిమా తర్వాత సరయిన హిట్ లేని గోపీ మళ్ళీ కొత్త దర్శకుడుతో సినిమా చేయడం అంటే సాహసమనే చెప్పాలి.

More Related Stories