English   

కాంగ్రెస్ లో చేరిన రంగీలా ఊర్మిళ !

Urmila-Matondkar
2019-03-27 12:19:23

సినీ నటులు రాజకీయాల్లోకి రావడం షరా మామూలే. తాజాగా కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంది బాలీవుడ్ భామ. ఊర్మిళ మటోండ్కర్ అంటే ఎవరికీ పెద్దగా తెలియక పోవచ్చు కానీ రంగీలా అంటే మాత్రం ఠక్కున గుర్తొస్తుందీ భామ. బాలీవుడ్ ని తన అందచందాలతో ఉర్రూతలూగించి 90వ దశకంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ఊర్మిళ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈ సందర్భంగా ఓ పుష్పగుచ్ఛాన్ని అందించి ఊర్మిళను పార్టీలోకి రాహుల్ సాదరంగా ఆహ్వానించారు. 90లలో కుర్రకారు మనసులను దోచుకున్న ప్రస్తుత 45 ఏళ్ల ఊర్మిళ ముంబై నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నట్టు సమాచారం. దీనికి సంబంధించి కాంగ్రెస్‌ త్వరలో అధికారిక ప్రకటన వెలువరించనుంది. లోక్‌ సభ ఎన్నికల్లో బీజేపీ సిట్టింగ్ ఎంపీ గోపాల్ శెట్టి పై పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరుగనుంది. వచ్చే నెల 29వ తేదీన నాలుగో దశలో ముంబై పరిధిలోని అన్ని లోక్ సభ స్థానాలు సహా, మరికొన్నింటికి పోలింగ్ నిర్వహించబోతున్నారు. ఉత్తర ముంబై ఎన్నిక కూడా అప్పుడే జరగవచ్చని తెలుస్తోంది.

More Related Stories