English   

జైలుకి వెళ్లిన జానీ మాస్ట‌ర్.. అస‌లు కార‌ణం ఏంటో తెలుసా..?

Jani-Master-jail
2019-03-27 12:52:49

చిరంజీవి, ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్, బ‌న్నీ లాంటి అగ్ర హీరోల‌కు కొరియోగ్ర‌ఫీ చేసి సంచ‌ల‌నం సృష్టించాడు జానీ మాస్ట‌ర్. సినిమాల‌తో ప‌రిచ‌యం ఉన్న ప్ర‌తీ ఒక్క‌రికి ఈ పేరుతో కూడా ప‌రిచ‌యం ఉంటుంది. అంత‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు ఈయ‌న‌. ఇక ఇప్పుడు ఇలాంటి కొరియోగ్ర‌ఫ‌ర్ ఉన్న‌ట్లుండి జైలుకు వెళ్ళాడు. అస‌లు న‌మ్మ‌డానికి కూడా ఇది క‌ష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. మేడ్చ‌ల్ కోర్టు ఈయ‌న‌కు 6 నెల‌ల శిక్ష‌ను విధించింది. ఛీటింగ్ కేసులో ఈయ‌న జైలుకు వెళ్ళిన‌ట్లుగా తెలుస్తుంది. నాలుగేళ్లుగా కోర్టులోనే ఉన్న ఈ కేసు ఇప్ప‌టికి ఫైన‌ల్ అయిపోయింది. ఈయ‌న‌తో పాటు మ‌రో ఐదుగురిని కూడా జైలుకు త‌ర‌లించారు. 2015 సంవత్సరంలో సెక్ష‌న్ 354, 324, 506 కింద జానీ మాస్ట‌ర్ పై కేసు నమోదు చేసారు. దీన్ని అప్ప‌ట్లో ఎవ‌రూ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. జానీ కూడా ఈ కేసును వ‌దిలేసాడు. అయితే ఇప్పుడు వ‌చ్చిన సంచ‌ల‌న తీర్పుతో షాక్ అవ్వ‌డం ఆయ‌న వంతు అయింది. 6 నెలల శిక్ష అంటే చిన్న విష‌యం కాదు. చెక్ బౌన్స్ కేసుతో పాటు మ‌రిన్ని కేసుల విష‌యంలో నిందితుడిగా కోర్టు తేల్చేసింది. ముఖ్యంగా జానీపై న‌మోదు చేసిన కేసుల్లో వివ‌రాలు బ‌య‌టికి తీయ‌గా.. ప్రమాదకరమైన ఆయుధాలతో గాయపర్చటం.. హ‌త్యాయ‌త్నం చేయ‌డం వంటి చర్యలు ఈ సెక్షన్ల కిందకే వ‌స్తాయంటున్నారు న్యాయ నిపుణులు. అయితే జానీ ఇలాంటి ప‌నులు ఎప్పుడు చేసాడో అని అంతా ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇందులో సెక్ష‌న్ 354 ఒక్క‌టే త‌ప్పు అని తేల‌గా.. మిగిలిన కేసుల్లో ఆయ‌న దోషిగా తేల్చింది కోర్ట్. దాంతో ఆరు నెల‌లు జైలు శిక్ష వేసింది.

More Related Stories