English   

ఎన్నికల వేళ వెనక్కి తగ్గిన బాలకృష్ణ.. మీడియాకు క్షమాపణలు..

Nandamuri Balakrishna issues an apology for attacking Media
2019-03-28 00:33:45

బాలకృష్ణ ఎప్పుడు సినిమాలతోనే కాదు.. అప్పుడప్పుడు వివాదాలతో కూడా వార్తల్లో నిలుస్తూనే ఉంటాడు. ఇది ఆయన ప్రత్యేకత. ముఖ్యంగా అభిమానులతో, ప్రేక్షకులతో ఆయన నడుచుకునే విధానంపై ఎప్పుడు కాంట్రవర్సీలు వస్తూనే ఉంటాయి. వాళ్లను కొట్టడం, దురుసుగా మాట్లాడటం బాలకృష్ణకు అలవాటుగా మారిపోయింది. తన మన భేదం లేకుండా అందరినీ ఒకేలాగా ట్రీట్ చేస్తుంటాడు నందమూరి నటసింహం. ఇది వరకే చాలాసార్లు మీడియాకు అలా దొరికిపోయాడు బాలకృష్ణ. ఇక ఇప్పుడు ఎన్నికల ప్రచారం సమయంలో కూడా మీడియా ముందు ఒక మీడియా రిపోర్టర్ ను తిడుతూ అడ్డంగా బుక్ అయిపోయాడు నందమూరి వారసుడు. దాంతో మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయాడు బాలకృష్ణ. ఒక టీవీ ఛానల్ రిపోర్టర్ ను బండ బూతులు తిడుతూ.. బాంబులు వేస్తాను.. నరికేస్తాను.. ప్రాణాలు తీయడం కూడా తనకు వచ్చు అంటూ ఓ రేంజ్ లో రెచ్చిపోయాడు బాలయ్య. ఇవన్నీ సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ అయ్యే సరికి అది అసలుకే ఎసరు వచ్చే లా మారిపోయింది. దాంతో చివరికి బాలకృష్ణ దిగివచ్చి క్షమాపణలు చెప్పక తప్పలేదు.

ఎందుకంటే అసలే ఇప్పుడు ఎన్నికల సమయం. ఇలాంటి టైమ్ లో మీడియాతో పెట్టుకుంటే ఎలా ఉంటుందో బాలకృష్ణకు తెలుసు. దాంతో తనే సారీ చెప్పాడో.. లేదంటే చంద్రబాబునాయుడు సారీ చెప్పించాడో తెలియదు కానీ మొత్తానికి బాలకృష్ణ సోషల్ మీడియాలో మీడియా మిత్రులకు సారీ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. ఎన్నికల ప్రచారంలో జరిగిన ఒక చిన్న పొరపాటు మీడియా మిత్రులు బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి అంటూ రాసుకొచ్చాడు బాలకృష్ణ. చిన్నపిల్లల మీద పడుతూ వీడియో తీస్తుండడంతో వారిని వద్దని వారించడం జరిగిందని.. కాని అతడు మీడియా మిత్రుడు అని ఆ తరువాతే తనకు తెలిసింది అని చెప్పాడు బాలయ్య. దయచేసి మన్నిస్తారని ఆశిస్తూ ఇట్లు మీ నందమూరి బాలకృష్ణ అంటూ ముగించాడు ఈ హీరో. ఏదేమైనా ఎప్పుడు క్షమాపణ చెప్పని బాలకృష్ణ ఇలా సోషల్ మీడియాలో ఒక ప్రకటన విడుదల చేయడం మాత్రం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

More Related Stories