English   

పవన్ మీద ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న వర్మ !

rgv
2019-03-28 01:57:17

నిత్యం ఏదో ఒక వివాదాంసంతో వార్తల్లో ఉండే వర్మ మరో ట్వీట్ చేసి సంచలనానికి తెర తీశాడు. గతంలో పవన్ అంటే వర్మ ఒంటి కాలి మీద లేచే వాడు, చాన్నాళ్ళ పాటు పవన్ ఏమి చేసినా వర్మ విమర్శిస్తూనే వచ్చే వాడు. మరి ఏమయిందో ఏమో కానీ మధ్యలో ఒకసారి పవన్ అంటే తనకు ఇష్టమని పవన్ గురించి ఇంకెప్పుడూ ట్వీట్ చేయనని ప్రకటించాడు. అయితే ఆ మాట తప్పి తర్వాత కూడా పవన్ టార్గెట్ గా ఎన్నో మార్లు వర్మ ట్వీట్ల్ తో విరుచుకుపడేవాడు. అయితే ప్రస్తుతం పవన్ ఎనిక్కల్లో పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన గాజువాక, భీమవరం స్థానాల నుండి పోటీ చేస్తున్నాడు. అయితే నిన్న రాత్రి సడన్ గా వర్మ తను భీమవరంలో పవన్ కి ప్రత్యర్ధిగా పోటీ చేస్తున్నానని ప్రకటించాడు. ఇదేందబ్బా నామినేషన్ గడువు కూడా అయిఉపోయక ఇప్పుడు పోటీ అంటాడు అని జనాలు ఆలోచించే లోపే నామినేషన్స్ తో సంబంధం లేకుండా తనకు చాలా పై స్థాయి వ్యక్తుల నుండి స్పెషల్ పర్మిషన్స్ వచ్చాయని త్వరలో వివరాలు చేబుతునానని ప్రకటించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ వర్మ మీద విరుచుకుపడుతున్నారు. పవన్ పేరు తలుచుకోకపోతే నిద్ర పట్టదా అని కొందరు విమర్శిస్తుంటే, వోడ్కా ఎక్కువయ్యింది పడుకో అంటూ మరి కొందరు విమర్శిస్తున్నారు.

More Related Stories