English   

షూటింగ్ లో ప్రమాదం....విశాల్ కి తీవ్ర గాయాలు !

Hero Vishal Injured In Turkey Movie
2019-03-28 02:18:17

మ‌రి కొద్ది రోజుల‌లో పెళ్ళి పీట‌లెక్క‌నున్న విశాల్ షూటింగ్‌లో గాయ‌ప‌డ్డారనే వార్తలు కోలీవుడ్ మీడియా వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. ఆయన ఇప్పుడు టెంప‌ర్ రీమేక్ చిత్రం అయోగ్యలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా షూట్ పూర్తయ్యిందట, అయితే ఆయన ప్ర‌స్తుతం సుందర్.సి ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ ట‌ర్కీలో జ‌రుగుతుండగా మంచి యాక్ష‌న్ సీన్ ఒకటి చిత్రీక‌రిస్తున్న స‌మ‌యంలో ఆయన సీన్ లో భాగంగా ఎటీవీ బైక్ నడపాల్సి వచ్చింది, ఆ సమయంలో పటుతప్పి అది కిందపడగా విశాల్ తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. ఈ ప్ర‌మాదంలో విశాల్ కాలు, చేయి ఫ్రాక్చ‌ర్ అయిన‌ట్టు చెబుతున్నారు. ఈ వార్తకు ఊతం ఇచ్చేలాగా సోష‌ల్ మీడియాలో విశాల్ కాలు, చేతికి బ్యాండేజ్‌తో ఉన్న ఫోటో చ‌క్క‌ర్లు కొడుతుంది. అయితే నిజానికి ఒక ఇరవై రోజుల క్రితం కూడా విశాల్ గాయపడినట్టు వార్తలు వచ్చాయి, యోగ్యలో బ్లాక్ బస్టర్ సాంగ్ చేస్తున్న సమయంలో ఒక క్లిష్టమైన స్టెప్ చేస్తున్నప్పుడు ఆయన కాలు, చెయ్యి బెణికినట్టు వార్తలు వచ్చాయి, అయితే ఆ వార్తలు వచ్చాక ఆయన హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కూతురు అనీశా రెడ్డితో నిశ్చితార్థం కూడా జ‌రుపుకున్నారు. ఆ వేడుక‌లో విశాల్ ఎంతో స‌ర‌దాగా క‌నిపించారు. అయితే ఇప్పుడు మళ్ళీ కట్లు కనపడడం చూస్తుంటే ఇది తాజాగా జరిగిన యాక్సిడెంట్ అనే అంటున్నారు సినీ జనాలు.  

 

More Related Stories