English   

ఈగ సుదీప్ కి అరెస్ట్ వారెంట్...అరెస్ట్ తప్పదా ?

Kichha Sudeep Arrest
2019-03-28 02:32:35

ఫేమస్ కన్నడ హీరో, తెలుగు లో ఈగతో ప్రేక్షకులకి సుపరిచితమయిన కిచ్చా సుదీప్ కి కోర్ట్ అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కాఫీ ఎస్టేట్ కేసులో ఆయనకు రుస వాయిదాలతో అవకాశమిచ్చినా ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాకపోవడంతో సుదీప్‌పై తాజాగా నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈమేరకు చిక్‌మగళూరు JMFC కోర్ట్ ఇచ్చిన ఉత్తర్వులు శాండల్‌వుడ్ ఇండస్ట్రీలో సంచనలం రేకేతిస్తున్నాయి. నిజానికి అసలు ఏమైందంటే చిక్కమగళూరుకు చెందిన దీపక్ మయూర్ అనే వ్యాపారికి చిక్కమగళూరులో ఇల్లు, కాఫీ తోట ఉండేవి . వారసదార అనే టీవీ షో కోసం వారు ఆ కాఫీ తోటను ఇంటిని లీజుకు తీసుకున్నారు. అయితే  షూటింగ్ సమయంలో ఇల్లు, ఫాం హౌస్ ద్వంసం అయ్యిందని దీపక్ మయూర్ ఆరోపిస్తున్నారు. ఈ మేరకు నటుడు సుదీప్, కన్నడ టీవీ రియాలిటీ షో డైరెక్టర్ మహేష్‌లపై కేసు నమోదైంది. కోటిన్నర పరిహారం కోరితే కుదరదంటున్నారని కోర్టుకు కూడా వెళ్ళాడు ఆ కాఫీ ఎస్టేట్ ఓనర్. కానీ విచారణకు హాజరు కాకుండా తప్పించుకుతిరుగుతున్నాడు సుదీప్. దేంతో ఆయన మీద నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేస్తూ ఎట్టి పరిస్థితుల్లోనూ మే 22 లోగా సుదీప్‌ని పట్టుకుని హాజరు పరచాల్సిందిగా కర్ణాటక పోలీసుల్ని ఆదేశించింది చిక్‌మంగళూరు కోర్టు.    

 

More Related Stories