English   

మహర్షి చోటీ చోటీ బాతే చెప్పడానికి వచ్చేస్తున్నాడు !

Maharshi
2019-03-28 02:45:57

సూపర్‌ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం మహర్షి. ఇది మహేష్ కేరీలో మైలురాయి లాంటి 25వ సినిమా కూడా కావటంతో మహర్షిపై భారీ అంచనాలు ఉన్నాయి. వంశీ పైదిపల్లితో మొదటి సారి మహేష్ పనిచేయడం, అల్లరి నరేష్ కూడా సినిమాలో భాగం కావడం, పూజా హీరోయిన్ గా ఉండడం ఈ సినిమా మీద మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఉన్న ఈ  సినిమాను మే9 న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. అందుకే సినిమా ప్రమోషన్స్ ని జోరుగా చేస్తోంది చిత్ర యూనిట్, నిన్న ఈ విషయాన్ని ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో తొలిసారిగా అల్లరి నరేష్‌ లుక్‌ను  రివీల్ చేశారు. అల్లరి నరేష్, పూజా, మహేష్ లు కలిసి నడుస్తున్న పోస్టర్ ని విడుఅల చేశారు. ఇందులో వారి డ్రెసింగ్ చూస్తే వారు కాలేజ్ లో ఉన్నట్టు అర్ధం అవుతుంది. మరో పోస్టర్ లో ముగ్గురూ మూడు వైపులకి చూస్తున్న పోస్టర్ కనిపించింది. అయితే ‘ఛోటి ఛోటి బాతే’ అంటూ సాగే ఫ్రెండ్‌ షిప్‌ సాంగ్‌ను 29 ఉదయం 9:09 నిమిషాలకు విడుదల చేస్తున్నట్టుగా ప్రకటించింది చిత్ర యూనిట్. దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్న ఈ సినిమాని దిల్ రాజు, అశ్వనీదత్‌, పీవీపీలు సయుక్తంగా నిర్మిస్తున్నారు.

More Related Stories