English   

రామ్ చరణ్, కేటీఆర్ మధ్య చిచ్చు పెట్టిన పవన్ కళ్యాణ్..

ktrcharan
2019-03-28 03:07:17

అవును.. నమ్మడానికి కాస్త విచిత్రంగా అనిపించినా కూడా ఇప్పుడు ఇదే నిజం. ఇది వరకు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం రామ్ చరణ్ ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. బాబాయ్ ఒక్క కాల్ చేస్తే చాలు వెంటనే వెళ్లి ప్రచారంలో పాల్గొంటానని చెప్పాడు వారసుడు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. నిజంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోన్ చేసి రామ్ చరణ్ ను రమ్మని అడిగినా సాయం చేసే పరిస్థితిలో చరణ్ లేడేమో అనిపిస్తుంది. దానికి కారణం కూడా లేకపోలేదు. తెలంగాణ మంత్రి కేటీఆర్ తో రామ్ చరణ్ కు మంచి స్నేహం ఉంది. ఉపాసన కూడా వీళ్ళ ఫ్రెండ్స్ బ్యాచ్ లోనే ఉంది. ఎప్పుడు ఏ సాయం కావాలన్నా ఏ పని జరగాలి అన్నా కేటీఆర్ కూడా మెగా ఫ్యామిలీకి అండగా ఉంటాడు. వాళ్ల కుటుంబ వేడుకలకు కూడా రెగ్యులర్ గా వస్తుంటాడు.

పవన్ కళ్యాణ్ కూడా తనకు కేటీఆర్, కేసీఆర్ అంటే చాలా ఇష్టమని ఇదివరకే చెప్పాడు. అయితే ఈ మధ్య కాలంలో పవన్ పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రచారంలో భాగంగా తెలంగాణపై చేసిన కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు మెగా కుటుంబంతో కేటీఆర్ కు ఉన్న సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని చెబుతున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా తెలంగాణలో ఆంధ్రా వాళ్ళపై దాడులు చేస్తున్నారు.. మనకు సిగ్గులేదా అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇలాంటి సమయంలో బాబాయ్ జనసేన పార్టీకి రామ్ చరణ్ వచ్చి ప్రచారం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా పవన్ చేసిన వ్యాఖ్యలు కేటీఆర్, రామ్ చరణ్ స్నేహాన్ని కూడా దెబ్బతీసేలా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో మెగా కుటుంబంతో కేటీఆర్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చూడాలి.

More Related Stories