English   

సాయి పల్లవి, విజయ్ పెళ్లి చేసుకుంటున్నారా.. అసలు నిజం ఏంటి..

Sai Pallavi dating AL Vijay
2019-03-28 03:22:19

సినిమా ఇండస్ట్రీ అన్న తర్వాత గాసిప్స్ కచ్చితంగా వస్తుంటాయి. అవి రాకూడదు అని ఆపే హక్కు ఎవరికీ లేదు. సెలబ్రిటీ లైఫ్ అన్నప్పుడు తెరిచిన పుస్తకం.. కచ్చితంగా అందులో ఎవరికి తోచిన విధంగా వారు రాసుకుంటారు. అయితే కొన్నిసార్లు మరి హద్దులు దాటిన రూమర్స్ కూడా సెలబ్రిటీలను ఇబ్బంది పెడుతుంటాయి. సాయి పల్లవి విషయంలో కూడా ఇదే జరిగింది. ఈమె దర్శకుడు విజయ్ ని పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కొన్ని రోజులుగా తమిళ ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ఇద్దరు గతంలో కణం సినిమాకు కలిసి పని చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా సాయిపల్లవికి నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. ఇక ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ దర్శకుడు ఏ.ఎల్ విజయ్ ని సాయి పల్లవి ప్రేమిస్తుందని.. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

దీనిపై వెంటనే సాయి పల్లవి కూడా స్పందించింది. ఇలాంటి అర్థం లేని వార్తలు రాయడం మంచిది కాదని.. నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుంది అంటూ మీడియాకు చురకలు అంటించింది. ఇందులో ఏ మాత్రం నిజం లేదని.. తాను తన సినిమాలతో బిజీగా ఉన్నానని క్లారిటీ ఇచ్చింది సాయి పల్లవి. మరోవైపు విజయ్ కూడా ఇదే విషయం ప్రస్తావించాడు. సాయి పల్లవితో పెళ్లి అనే విషయంపై ఎలాంటి నిజం లేదని.. తాను ప్రస్తుతం దేవి 2 సినిమాతో పాటు తలైవి పనుల్లో బిజీగా ఉన్నానని చెప్పాడు. కనీసం ఇప్పటి నుంచైనా మరి ఇంత హద్దులు మీరి వార్తలు రాయకండి అంటూ మీడియాను కోరుతుంది సాయి పల్లవి. విజయ్ కూడా నిజాలు తెలుసుకొని రాస్తే బాగుంటుందని కోరుకుంటున్నాడు. ఏదేమైనా వీళ్లిద్దరిపై వచ్చిన రూమర్స్ ఇప్పుడు తమిళనాట సంచలనంగా మారుతున్నాయి.

More Related Stories