English   

ఫ్లాప్ హీరో సరసన చాన్స్ కొట్టేసిన మేఘా !

Megha Akash to romance Raj Tarun
2019-03-28 03:49:45

హీరో నితిన్ పక్కన వరుసగా రెండు సినిమా ఆఫర్ లు కొట్టేసింది తమిళ పొన్ను మేఘా ఆకాష్. చక్కనైన రూపంతో నిండుగా ఉండే ఈ భామని చూసి నక్కతోక తొక్కింది అనుకున్నారు. కానీ ఆ రెండు సినిమాల్ల దెబ్బకు అటు నితిన్ ఇటు ఈ భామకి సినిమాలు లేక సైలెంట్ అయిపోయారు. ఇలాంటి సమయంలో ఆ భామకు ఇక సినిమా అవకాశాలు కష్టమే అనుకున్నారు జనాలు. కానీ అనూహ్యంగా ఆమె దిల్ రాజు బ్యానర్ లోనే చాన్స్ కొట్టేసిండానే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అసలు సినిమాలే లేక ఖాళీగా ఉన్న రాజ్ తరుణ్ తో దిల్ రాజు ఒక సినిమా ప్లాన్ చేస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాని ఆడు మగాడ్రా బుజ్జి సినిమా తీసిన కృష్ణా రెడ్డి తెరకేక్కిస్తున్నాడు. ఈ సినిమాలోనే మేఘకి అవకాసం ఇచ్చారని చెబుతున్నారు. నిజానికి ఈ డైరెక్టర్ తోనే మహేశ్ బాబు మేనల్లుడు గల్లా జయదేవ్ కొడుకు సినిమా ప్రారంభం అయింది, కారాణాలు ఏమో తెలియదు కాబట్టి ఆ సినిమా తెరకేక్కలేదు. అయితే ఇప్పుడు అదే డైరెక్టర్ కాబట్టి అదే కధా ? లేక వేరే కధా ? అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories