English   

బోయపాటి వర్క్ తో ఖుషి అవుతున్న చంద్రబాబు నాయుడు..

Boyapati Srinu  TDP Ads 2019
2019-03-28 04:03:40

ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఏపీలో ఎవరు గెలుస్తారో అనే ఆసక్తి రోజురోజుకి పెరిగిపోతుంది. ఒక వైపు జగన్.. మరోవైపు చంద్రబాబు నాయుడు.. ఇంకోవైపు పవన్ కళ్యాణ్ ఎవరికి వారు ప్రచారంలో బిజీగా ఉన్నారు. మొన్నటి వరకు జగన్ గెలుస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా టఫ్ ఫైట్ ఇస్తాడని.. ఖచ్చితంగా ఈసారి ఎన్నికలు అంత ఈజీగా మాత్రం ఉండడం లేదు అంటూ రాజకీయ విశ్లేషకులు తెలియజేస్తున్నారు. ఇలాంటి సమయంలో బోయపాటి శ్రీను తెరకెక్కించిన తెలుగుదేశం యాడ్స్ ప్రజలకు బాగా నచ్చుతున్నాయి. ముఖ్యంగా కార్యకర్తలు అయితే ఈ యాడ్స్ చూసి పండగ చేసుకుంటున్నారు. సినిమా స్థాయిలో లో ఈ యాడ్స్ లో మాస్ ఎలివేషన్స్ ఇచ్చాడు బోయపాటి శ్రీను. ఇవి చూసి ఇప్పుడు కార్యకర్తలతో పాటు అభిమానులు కూడా ఈ దర్శకుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు.

ఇప్పటి వరకు వచ్చిన యాడ్స్ ఒక ఎత్తు అయితే ఇప్పుడు బోయపాటి తెరకెక్కిస్తున్న యాడ్ మరొక ఎత్తు అవుతుంది అంటున్నారు తెలుగుదేశం కార్యకర్తలు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ఎలా మోసం చేశారు అనేది హైలైట్ చేస్తూ రెండు నిమిషాల నిడివి ఉండేలా ఒక యాడ్ చిత్రీకరిస్తున్నారని తెలుస్తుంది. ఇది విడుదలైన తర్వాత కచ్చితంగా అందరూ కళ్ళు మూసుకుని వెళ్లి తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని ధీమాగా చెబుతున్నారు బోయపాటి శ్రీను. ఐదేళ్ల కిందట ఎన్నికల ప్రచారంలో ఆంధ్రప్రదేశ్ కు ఆయన ఇచ్చిన మాట.. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన సమయంలో ఆయన మాట్లాడిన మాటలను హైలైట్ చేస్తూ ఈ యాడ్ రూపొందిస్తున్నాడు బోయపాటి శ్రీను. త్వరలోనే ఇది కూడా టీవీలో ప్లే కానుంది. కచ్చితంగా ఈ యాడ్స్ అన్నీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ మైలేజ్ పెంచడంలో బాగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. మరి బోయపాటి శ్రీను చేసిన ఈ యాడ్స్ పార్టీ కి ఎంతవరకు పనికొస్తాయో చూడాలి.

 

More Related Stories