English   

విజయ్ దేవరకొండని తిప్పలు పెడుతున్న సూర్య..

Vijay Devarakonda Out Of Race
2019-03-28 04:24:05

విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఆయన నటిస్తున్న డియర్ కామ్రేడ్ సినిమా మే 31న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని ఇప్పటికే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఈ మధ్యే విడుదలైన టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య ఉన్న లిప్ లాక్ సీన్ కూడా కాస్త వివాదాస్పదం అయింది. ఇదిలా ఉంటే ఈ సినిమా మే 31న రావడం కష్టమే అని ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ప్రత్యేకంగా కారణం కూడా ఏమీ లేదు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న డియర్ కామ్రేడ్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఎట్టి పరిస్థితుల్లోను మే 31న సినిమా విడుదలకు ఎలాంటి అడ్డంకులు లేవు. అయితే తమిళనాట సూర్య నటిస్తున్న NGK సినిమా కూడా మే 31న విడుదల కానుంది. సెల్వరాఘవన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

దానికి తోడు టీజర్ కూడా అద్భుతంగా ఉండటంతో ఈ సినిమాతో సూర్య సంచలనం సృష్టించడం ఖాయం అని అభిమానులు కూడా నమ్ముతున్నారు. ఇక డియర్ కామ్రేడ్ సినిమాను తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ భాషల్లో కూడా విడుదల చేస్తున్నారు. తెలుగులో సూర్య సినిమా నుంచి విజయ్ కి వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ తమిళనాట మాత్రం కచ్చితంగా సూర్య అప్పర్ హ్యాండ్ సాధిస్తాడు. అక్కడ సూర్యను కాదని విజయ్ దేవరకొండ సినిమాకు ఎక్కువ వసూళ్లు వచ్చే సమస్య లేదు. అలాంటప్పుడు కచ్చితంగా కలెక్షన్లపై దెబ్బ పడుతుందని భావిస్తున్నారు డియర్ కామ్రేడ్ టీం. అందుకే తమ సినిమాను మే 31న కాకుండా జూన్ మొదటి వారంలో తీసుకు వస్తే బాగుంటుందని ప్లాన్ చేసుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఎన్జికె విడుదలైన తర్వాత తమ సినిమాను తీసుకొస్తే ఎలాంటి సమస్య ఉండదని భావిస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్.

More Related Stories