English   

సైలెంట్ గా సినిమా ఒప్పేసుకున్న బన్నీ !

Dil Raju brings Allu Arjun, Venu Sriram together
2019-03-28 05:02:11

ఈ మధ్య వరస సినిమాలో ఫ్లాప్ లు కొట్టి కొన్నాళ్ళగా లాంగ్ గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ మల్ల్లీ ఫాంలోకి వస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రెండు సినిమాలు ఒప్పుకున్న ఆయన తన మూడవ సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు ఫిలిం నగర్ వర్గాల సమాచారం. అది కూడా చాలా సైలెంట్ గా మీడియాకి ఉప్పందకుండా దానిని ఓకే చేసేసాడని అంటున్నారు. ఆ సినిమా తెరక్కించేది వేణు శ్రీ రామ్ అని అంటున్నారు. గతంలో దిల్ రాజు కోసం రెండు సక్సెస్ ఫుల్ సినిమాలు ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాలు అందించిన వేణు శ్రీరామ్ ఈ సినిమా లైన్ చెప్పి బన్నీని ఒప్పించాడట.

నిజానికి ఆయన ఎంసీఏ సినిమా కంటే బన్నీతో సినిమా చేస్తాడని వార్తలు వచ్చాయి, కానీ బన్నీ అప్పుడు మంచి ఫాంలో ఉండడంతో మనోడిని పట్టించుకోలేదని అయితే లైన్ మాత్రం తెగ నచ్చడంతో ఇప్పుడు పిలిచి మరీ లైన్ డెవలప్ చేయమని చెప్పారని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే  బన్నీ త్రివిక్రమ్, సుకుమార్ లతో సినిమాలు ఉంటాయని ప్రకటించాడు, ఇప్పుడు ఈ సినిమా ఆ సినిమాల తర్వాత మొదలు పెడతారా ?లేక మధ్యలో కానిచ్చేస్తారా అనేది వేచి చూడాలి.

More Related Stories