English   

బన్నీ ఫ్యాన్స్ నిరాశ...క్లారిటీ ఇచ్చిన యూనిట్ !

allu arjun and trivikram srinivas movie updates soon
2019-03-28 05:21:53

గత ఏడాది చివరిలో బన్నీతో సినిమా ఉంటుందని హరికా హాసినీ వారు ప్రకటించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ హీరోగా, త్రివిక్రమ్ డైరెక్టర్ గా అల్లు అరవింద్-చినబబుల సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా ఉంటుందని ప్రకటన వచ్చింది, కానీ ఇప్పటి దాకా సినిమా గురించి మరే విషయమూ బయటకు రాలేదు. దీంతో చాన్నాళ్ళ నుండి బన్నీ నుండి సినిమా వస్తుందని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బన్నీ ఫ్యాన్స్. ఈ మధ్య కాలంలో చరణ్ పుట్టినరోజు నాడు ఈ సినిమా లాంచ్ ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి. కానీ అదేమీ జరగలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ నిరుత్సాహ పడ్డారు.

దీంతో సోషల్ మీడియాలో బన్నీ ఫ్యాన్స్ నిరుత్సాహాన్ని గమనించిన సినిమా యూనిట్ వారికి క్షమాపణ లాంటిది చెప్పుకొచ్చింది. మీ ప్రతి ఫీలింగ్ మేము అర్ధం చేసుకోగలమని మీరు ఎంత ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారో తాము కూడా అంతే ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని, ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని, ఒక్కసారి ఆ పనులు పూర్తి అయి ఒక కొలిక్కి వస్తే వెంటనే సినిమాకి సంబందించిన విషయాలను అప్డేట్ ఇస్తామని వారు ట్వీట్ చేశారు. వీలయినంత త్వరలో ఆ వివరాలను ప్రకటిస్తామని ట్వీట్ లో పేర్కొన్నారు.

More Related Stories