English   

ముసుగు తీసేసిన చిన్ని కృష్ణ...ఫ్యాన్ పంచకే !

Chinni-Krishna
2019-03-28 10:30:14

గత కొద్ది రోజుల క్రితం సినీ రచయిత చిన్నికృష్ణ మెగా ఫ్యామిలీ మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ని కార్నర్ చేయడానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద ఎత్తున విమర్శలు చేసిన విషయం తెలిసిందే. చిన్నికృష్ణ చేసిన వ్యాఖ్యలు సినీ వర్గాలలో సంచలనానికి తెర తీశాయి. చాన్నాళ్ళ క్రితం తారా చౌదరి వ్యవహరం జరిగిన నుండి ఆయన ఒకరకంగా మీడియా ముందుకు రాలేదు, అలాంటి వ్యక్తి అసలు తనకు ఏమాత్రం సంబంధం లేని చిన్నికృష్ణ ఎందుకు ఇంతలా రియాక్ట్ అవ్వాల్సొచ్చింది అన్న విషయం ఎవరికీ అర్ధం కాలేదు. అయితే ఆయన మాటలను బట్టి ఆయన వెనక ఏదైనా పార్టీ ఉండి ఉంటుందని భావించారు అందరూ.  ఇప్పుడు అందరి అనుమానాలను నిజం చేస్తూ చిన్నికృష్ణ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొని చేరిపోయారు. ప్రస్తుతం జగన్ పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన నిమిత్తం పాలకొల్లులో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఆ సభలోనే ఆయన కండువా కప్పుకున్నారు.  వైసీపీలో చేరడం తనకు ఆనందంగా ఉందని ఏపీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జగన్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమని చిన్నికృష్ణ చెప్పారు.  

More Related Stories