English   

బుల్ బుల్ తో కలిసి వచ్చి సినిమా చూడొచ్చు !

RGV
2019-03-29 01:54:57

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఈరోజు తెలంగాణలో విడుదల కానుంది, ఏపీలో తప్ప మిగతా ప్రకటించిన అన్ని చోట్లా ఈ సినిమా విడుదల అవుతుందని వర్మ ప్రకటించాడు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఈ సినిమా శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లోనూ విడుదల కావాల్సింది. కానీ ఏప్రిల్ 3 వరకు ఈ సినిమాను ఏపీలో రిలీజ్ చేయడానికి వీల్లేదని ఏపీ హైకోర్ట్ ఆదేశించింది. ఏప్రిల్ 3న తమకు సినిమాను ప్రదర్శించాలని, తాము చూసిన తరవాత నిర్ణయాన్ని వెల్లడిస్తామని న్యాయమూర్తులు పేర్కొన్నారు. హైకోర్టు వర్మ సుప్రీం కోర్టులో సవాల్ చేయనున్నారు. అలాగే ఈరోజు 11 గంటలకు ప్రసాద్ ల్యాబ్స్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించాడు. అయితే ఎన్టీఆర్ సినిమా రిలీజ్ కాకుండా చేయడం ద్వారా ఆ వ్యక్తి అప్పుడు ఎలా అయితే సింహగర్జన చేయనీయలేదో ఇప్పుడు అలాగే వెన్నుపోటు పొడిచి సినిమా ఆపేసాడని పేర్కొన్నారు. అంతే కాక కత్తి మహేష్ పెట్టిన పోస్టును కూడా వర్మ షేర్ చేశారు. అన్ని చోట్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని చంద్రబాబు ఆయన సొంత రాష్ట్రంలో ఈ సినిమా చూడలేరు కాబట్టి ఆయనకు కావాలనుకున్న చోట్ల రెండు టికెట్లు ఆఫర్ చేస్తానని బుల్ బుల్ తో కలిసి వచ్చి సినిమా చూడచ్చు అని వర్మ పేర్కొన్నారు.

More Related Stories