English   

లక్ష్మీస్ వీరగ్రంధం కూడా వచ్చేస్తోంది !

Lakshmis-veeragrandham
2019-03-29 07:38:28

ఎన్టీఆర్ జీవితంలోని చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ఏపీ హైకోర్టు స్టే  విధించిన సంగతి తెలిసిందే. చంద్రబాబుని టార్గెట్ గా చేసుకొని ఆర్జీవి తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ ని ఎన్నికలు అయ్యేంత వరకు చేయడానికి వీలు లేకుండా చేయమని కొందరు ఇంజెక్షన్ పిటిషన్ వేయగా హై కోర్ట్ స్టే ఇచ్చింది. అయితే, తెలంగాణలో మాత్రం విడుదలకు ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ముందుగా ప్రకటించిన ప్రకారమే నేడు సినిమా విడుదల కానుంది. ఏపీలో విడుదల ఆపినందుకు కాను ఆర్జీవీ ఇప్పుడు సుప్రీం తలపు తట్టనున్నాడు. ఇదిలా ఉంటే లక్ష్మీస్ ఎన్టీఆర్ కి పోటీగా కేతిరెడ్డి అనే దర్శకుడు శ్రీరెడ్డినిపెట్టి లక్ష్మీస్ వీరగ్రంధం అనే సినిమాని తీస్తున్నట్లు అప్పట్లో ప్రకటించాడు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన టీజర్స్ కూడా రిలీజ్ చేసారు. అయితే శ్రీ రెడ్డిని ఆ టీజర్స్ లో ఎక్కడా చూపలేదు. అయితే ఇప్పుడు ఆ సినిమా రిలీజ్ కి సిద్దమవుతోంది. కేతిరెడ్డి జగదీశ్వర్‌రెడ్డి రూపొందించిన ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ సినిమా విడుదల పైన కొందరు కోర్టును ఆశ్రయించారు. అయితే సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, వచ్చే నెల 8న సినిమా విడుదల చేయనున్నట్టు కేతిరెడ్డి తాజాగా ప్రకటించారు.
 

More Related Stories