English   

సూర్యకాంతం మూవీ రివ్యూ

Suryakantham
2019-03-29 07:48:38

అదేంటో కానీ మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొందరు ఎన్ని దండయాత్రలు చేసినా వారిని విజయం వరించదు. అందులో మెగా డాటర్ నీహారిక ఒకరు. నాగశౌర్యతో నా మనసు అనే సినిమాతో తెరంగ్రేటం చేసిన ఆమె, ఆ తర్వాత హిట్ కోసం దండయాత్రలు చేస్తూనే ఉంది. ఇక తాజాగా ఆమె నటించిన సినిమా సూర్యకాంతం. గతంలో ఆమెతో వెబ్ సిరీస్ తీసిన ప్రశాంత్ ఈ సినిమాని తీశారు. ఈ సినిమా అయినా ఆమెకి హిట్ ఇస్తుందో లేదో చూద్దాం.

కధ :
సూర్యకాంతం(నిహారిక) పెంకి పిల్ల, చిన్నప్పుడే అమ్మానాన్న విడిపోవడంతో ఆమె తల్లి దగ్గరే పెరుగుతుంది. తల్లి గారాబంతో ఆమె పెంకిగా, ఏమి తోస్తే అది చేస్తే అమ్మాయిగా తయారవుతుంది. అయితే ఆమె అలా ఉండడాన్ని చుసిన రాహుల్ విజయ్ ఆమెతో ప్రేమలో పడతాడు, ఒక రోజు ప్రపోజ్ కూడా చేస్తాడు. అయితే అంతలోనే ఆమె కనపడకుండా పోతుంది. దీంతో లైట్ తీసుకున్న విజయ్ మరో అమ్మాయి వెంట పడతాడు, ఆమె ప్రేమలో పడగానే ఎంగేజ్మెంట్ చేసుకుంటారు, మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది సూర్యకాంతం. ఆ తర్వాత ముగ్గురి జీవితాల్లో ఎటువంటి మలుపులు చోటు చేసుకున్నాయి అనేదే కధ,

నటీనటుల పెర్ఫార్మెన్స్ :

తింగరి పిల్లగా నిహారిక చక్కగా నటించింది, ఇక మరో హీరోయిన్ కూడా ఫరవాలేదనిపించింది. రాహుల్ విజయ్, సుహాసిని,సమీర్,శివాజీ రాజాలు తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.

టెక్నీషియన్స్ సంగతి చూస్తే : 

వెబ్ సిరీస్ లు తెరకెక్కించిన ప్రణీత్ ఒక వెబ్ సిరీస్ తీయాల్సిన కంటెంట్ తో సినిమా తీసేశాడు అనిపించింది. మొత్తానికి అంతగా ఆకట్టుకోలేదు మనోడి డైరెక్షన్, ఇక ఎడిటింగ్ మీద శ్రద్ద పెడితే బాగుండు అనిపించింది. కథ,కథనంతో బోర్ కొట్టించి సినిమా మొత్తం సాగతీసి  మొత్తానికి ఒక వెబ్ సిరీస్‌ లా తెరకెక్కించాడు. అలాగే ఫోటోగ్రఫీ ఈ సినిమాకి మైనస్.  మొత్తంగా సినిమా ఆశించినంత అయితే లేదు.

రేటింగ్: 1.5/5

More Related Stories