English   

చోటీ చోటీ బాతే చెబుతున్న మహేష్ !

Maharshi
2019-03-29 09:47:01

ఈ ఏడాదిలో వస్తున్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో మహేష్ మహర్షి మూవీ ఒకటని చెప్పొచ్చు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లరి నరేష్ సోనాల్ చౌహాన్ మీనాక్షి దీక్షిత్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా విడుదలకి సిద్దం అవుతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్న ఈ సినిమా విడుదలని మేనెల 9న ప్లాన్ చేశారు. అయితే ఇప్పటి నుండే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ వీడియో రిలీజ్ చేసారు. చోటీ చోటీ  బాతే అంటూ సాగుతున్న ఈ సాంగ్ ని స్వయంగా దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేసి ఆయనే పాడారు. ఫిలిం నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చిన 3 ఇడియట్స్ లైన్ నుంచి ప్రేరణ పొందిన సినిమాగా ఉండబోతుందని అంటున్నారు. ఇక దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో వచ్చిన ఈ చోటి చోటి బాతే పాట అందరినీ ఆకట్టుకుంటోంది. శ్రీ మని లిరిక్స్ అందించిన ఈ పాటని మీరూ వినండి మరి.

More Related Stories