English   

వదోదరా వెళ్ళిన ఆర్ఆర్ఆర్ యూనిట్....భారీ షెడ్యూల్ !

RRR
2019-03-29 10:46:04

తెలుగులోనే మచ్ అవైటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ సినిమా ఇటీవల హైదరాబాద్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ ను పూర్తి చేసుకుంది. ఇక ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ నార్త్ ఇండియాలో గుజరాత్ లోని వదోదరలో జరుగనుంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్ర‌లో క‌నిపించ‌నుండ‌గా, రామ్ చ‌ర‌ణ్ అల్లూరి సీతారామ‌రాజు గెట‌ప్‌లో క‌నిపించనున్నాడు. స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రలను బేస్ చేసుకొని రాజ‌మౌళి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. వదోదరలో జ‌ర‌గ‌నున్న భారీ షెడ్యూల్ కోసం తాను రామ్ చ‌ర‌ణ్, రాజమౌళి వెళుతున్న‌ట్టు ఎన్టీఆర్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు . హైద‌రాబాద్ నుండి వ‌డోద‌రకి బుక్ అయిన టిక్కెట్‌ని షేర్ చేస్తూ బిగ్ షెడ్యూల్ కోసం వెళుతున్నామ‌ని పేర్కొన్నాడు ఎన్టీఆర్. దాదాపు 45 రోజులు ఈ షెడ్యూల్ జ‌ర‌గ‌నుంద‌ని తెలుస్తుండ‌గా, ఈ షెడ్యూల్‌లో అలియా భట్ , డైసీ ఎడ్గార్ జోన్స్ లు కూడా జాయిన్ కానున్నారని అంటున్నారు. గుజరాత్ రాష్ట్రం లోని సిటీలలో వడోదర ఒకటి. ఈ నగరానికి మరో పేరు బరోడా. స్వాతంత్ర్యానికి పూర్వం గైక్వాడ్ రాజ్యపు రాజధానిగా ఉండిన ఈ నగరం ప్రస్తుతం బరోడా జిల్లా రాజధానిగా కొనసాగుతోంది.  

More Related Stories