English   

ఎన్నికల బరిలో సినీ నటి సంజన !

Sanjana
2019-03-29 12:02:36

ఏపీ ఎన్నికల బరిలో మరో సినీ నటి నిలబడిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బిగ్ బాస్-2 పార్టిసిపెంట్, సినీ నటి సాయి సంజన కృష్ణా జిల్లా నూజివీడు శాసనసభ నియోజకవర్గానికి ఇండిపెండెంట్ గా నామినేషన్ వేసినట్టు తాజాగా వెల్లడయ్యింది. ఆమె సొంత ఊరు నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి మండలంలోని కృష్ణవరం కాగా ఆమె అసలు పేను వనజ అట.  2016లో సంజన మిస్ హైదరాబాదుగా ఎంపికైన ఆమె నెమ్మదిగా సినీపరిశ్రమలోకి వెళ్లిన తర్వాత జనజాగృతి అనే రాజకీయ పార్టీలో ఆమె చేరారు. ఆమె ఒకటి రెండు సినిమాలు చేసినా ఆమెకు సరయిన గుర్తింపు దక్కలేదు. అయితే తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ రెండో సీజ‌న్‌లో ఎంట్రీ ఇచ్చి మొద‌టి వారంలోనే బ‌య‌టికి వ‌చ్చేసినా జనాల్లో గుర్తింపు పొందింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు ఆమె ప్రయత్నించినా, ఆమెకు టికెట్ దక్కలేదు. దీంతో, స్వతంత్ర అభ్యర్థిగా ఆమె బరిలోకి దిగారు. దివంగత మంత్రి పాలడుగు వెంకట్రావుకు ఆమె సమీప బంధువు కాగా ఆమె త్రండ్రి ధనకోటేశ్వరరావు ఆ మండలంలోనే ప్రముఖ రైతు.
 

More Related Stories