English   

సాయిపల్లవితో పెళ్లి....క్లారిటీ ఇచ్చిన అమలా పాల్ మాజీ భర్త ! 

AL-Vijay
2019-03-30 04:06:33

గత కొద్దిరోజులుగా ఒక డైరెక్టర్ తో సాయి పల్లవి పెళ్లి అని వార్తలు హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే, అమలా పాల్‌ మాజీ భర్త అయిన విజయ్‌ సాయి పల్లవి నటించిన కణం సినిమాకు దర్శకత్వం వహించారు. ఆ సినిమా చిత్రీకరణ సమయంలోనే ఇద్దరూ ప్రేమించుకున్నారని, త్వరలో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జ‌రిగింది. దీనిపై ముందుగా స్పందించిన సాయి ప‌ల్లవి త‌ప్పుడు వార్త‌లు రాస్తే రాసిన వారి మీద పరువు నష్టం దావా వేస్తాన‌ని ఫైర్ అయింది. మరో పక్క విజ‌య్ మీడియాతో స్పందిస్తూ ఒకసారి వైవాహిక జీవితంతో ఒకసారి ఇబ్బంది పడిన తాను ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకునే అవ‌కాశం లేదని ఇలా పుకార్లు సృష్టించి, రెండు కుటుంబాల‌ని ఇబ్బందుల‌లో పెట్ట‌కండి అని విజ‌య్ స్ప‌ష్టం చేశారు. ఐదేళ్ళ క్రితం అమ‌లా పాల్‌ ని వివాహం చేసుకున్న విజ‌య్ ప‌లు కార‌ణాల వ‌ల‌న రెండేళ్ళ క్రితం విడిపోయారు. ఏఎల్ విజ‌య్ ప్ర‌స్తుతం జ‌య‌ల‌లిత బయోపిక్ తెరకేక్కిస్తున్నాడు. హిందీ, త‌మిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కంగనా ర‌నౌత్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.  

More Related Stories