English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి అంత సీన్ ఉందా ?

Laxmis-NTR
2019-03-30 04:26:43

ఎన్నో వివాదాలు మరెన్నో అడ్డంకులు ఇలా అన్నిటినీ దాటుకుని నిన్న ఎన్టీఆర్ జీవిత ఆధారంగా రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైంది. అయితే ఏపీలో ఈ సినిమాని విడుదల చేయడానికి అక్కడి హైకోర్టు పర్మిషన్ ఇవ్వకపోవడంతో అక్కడ ఈ సినిమా విడుదల కాలేదు. దీంతో ఈ సినిమాని తెలంగాణ సహా మిగతా రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌ లో రిలీజ్ చేసాడు. అయితే ఈ సినిమా ఏపీలో విడుదల కాకుండా పోవడానికి ముఖ్య కారణం టీడీపీ నాయకులు, వారు తమ చంద్రబాబును ఈ సినిమాలో విలన్ గా చూపారు అని వారు కేసులు వేయడంతో ఈ సినిమా మీద స్టే ఇచ్చింది అక్కడి కోర్టు. అయితే నిజానికి లక్ష్మీస్ ఎన్టీఆర్ నిజంగా ఆంధ్ర ప్రదేశ్ ఓటర్లను ప్రభావితం చేస్తుందా ? అంత దమ్ము ఈ సినిమాకు ఉందా ? వర్మ చెప్పింది అంతా నిజమే అని ప్రేక్షకులు నమ్ముతారా ? లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విజయం సాధిస్తే చంద్రబాబు నాయుడుపై వ్యతిరేకత ఉన్నట్లేనా ? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  కొత్తగా ఓటుహక్కు వచ్చిన 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల యువ ఓటర్లపై మాత్రమే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రభావం చూపిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు, ఎందుకంటే వీరికి అప్పట్లో జరిగిన సంఘటనలు తెలియవు, అందుకే ఇప్పుడు వారికి ఈ ఘటనలు ఎమోషనల్ గా చూపి వోట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని అంటున్నారు, సినిమా తీయడానికి ముఖ్య ఉద్దేశ్యం కూడా ఇదేనని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది.  

More Related Stories