English   

బ్రోచెవారెవరురాలో నివేదా లుక్ రివీల్ 

Nivetha-Thomas
2019-03-30 06:57:14

శ్రీవిష్ణు హీరోగా రూపొందుతోన్న చిత్రం బ్రోచేవారెవరురా. మెంటల్ మదిలో సినిమా తరువాత యంగ్ హీరో శ్రీ విష్ణు , వివేక్ ఆత్రేయ కాంభినేషన్ లో ఈ సినిమా తెరకెక్కుతున్నది. ఈ మధ్య కాలంలో శ్రీ విష్ణు లుక్ విడుదల చేయగా ఈరోజు హీరోయిన్ నివేదా థామస్ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు. మన్యం ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై విజరు కుమార్‌ మన్యం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీవిష్ణుతో పాటు ప్రియదర్శి, రాహుల్‌ రామకృష్ణలు నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రిలీజ్ కూడా దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ లుక్ ని విడుదల చేశారు. పోస్టర్ ని బట్టి ఈ సినిమాలో నివేదా క్లాసికల్ డ్యాన్సర్ గా నటిస్తున్నట్లు అనిపిస్తుంది. క్రైమ్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మెంటల్ మదిలో సినిమాలో హీరోయిన్ గా నటించిన నివేత పేతురాజ్ మరో కథానాయికగా నటిస్తుంది. వివేక్ సాగర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ, సత్య దేవ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ లో విడుదలకానుందని అంటున్నారు.

More Related Stories