English   

క్రికెటర్ గా మారేందుకు జర్నీ ఆఫ్ జెర్సీ !

JERSEY
2019-03-30 08:08:23

నాని హీరోగా క్రికెటర్ జీవిత నేపధ్యంలో తెరకెక్కుతున్న సినిమా జెర్సీ. వచ్చే నెల 19న విడుద‌ల కానున్న ఈ సినిమాని హాసినీ హారికా క్రియేషన్స్ కు అనుబంధంగా ఏర్పాటు అయిన సితార ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌ మీద సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. తమిళ సంగీత సంచలనం అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రలో నటిస్తుండ‌గా, ఆయ‌న సరసన శ్రద్ధా శ్రీనాథ్ అనే బాలీవుడ భామ హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా చిత్రీక‌ర‌ణ‌కి సంబంధించిన విశేషాల‌ని ‘జర్నీ ఆఫ్ జెర్సీ’ అంటూ ఒక వీడియో రూపంలో తాయారు చేసి వదిలారు. ఇందులో గల్లీలలో క్రికెట్ ఆడుకునే నాని క్రికెట‌ర్‌ గా మారేందుకు ఎంత‌గా క‌ష్ట‌ప‌డ్డారో చూపించారు. అలా క్రికెటర్ గా కనిపించేందుకు నాని కష్టపడుతున్న సమయంలో సమహ్యంలో బాల్ నాని ముక్కుకి త‌గిలి బ్ల‌డ్ రావ‌డం కూడా వీడియోలో చూపించారు. అలాగే ఈ సినిమాలో క్రికెటర్ గా కనిపించేందుకు 70 రోజులు నాని క్రికెట్‌ లో శిక్ష‌ణ తీసుకున్న‌ట్టు తెలిపారు. ఈ చిత్రం కోసం 130 మంది ప్రొఫెషనల్ క్రికెటర్ లు పని చేశారని వారిలో 18 మంది ఇంగ్లండ్‌ కు చెందిన క్రీడాకారులున్నట్టు ఈ వీడియోలో తెలిపింది. 

More Related Stories