English   

నితిన్ సినిమాకి అనూహ్యమైన టైటిల్ !

Nithiin
2019-03-30 09:17:34

శ్రీనివాస క‌ళ్యాణం సినిమా ఫ్లాప్ ఇవ్వడంతో చాలా కాలం గ్యాప్ తీసుకున్న నితిన్ ఈ రోజు త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా కొన్ని ప్రాజెక్టుల‌కి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డించాడు. మొన్న హోలీ సందర్భంగా ఒక సినిమా ప్రకటించిన నితిన్ ఈరోజు మరో రెండు సినిమాలు ప్రకటించాడు. వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మా సినిమాలో నటించేందుకు రెడీ అయిన నితిన్ మరో సినిమాగా తనతో ఛల్‌ మోహన్‌ రంగ సినిమాను తెరకెక్కించిన కృష్ణ చైతన్య దర్శకత్వంలోను నితిన్ సినిమా చేయ‌నున్నాడు. తమ సొంత నిర్మాణ సంస్థ శ్రేష్ఠ మూవీ బ్యానర్‌ మీద నితిన్‌ తండ్రి సుధాకర్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు ప్రకటన విడుడల చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి ఆస‌క్తిక‌ర టైటిల్ సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ప‌వ‌ర్ పేట అనే టైటిల్ పరిశీలిస్తున్నారట. ఫిల్మ్ చాంబర్లో ఈ టైటిల్ ను రిజిస్టర్ చేసారని దాదాపు ఇదే టైటిల్ ఖరారు అవుతుందని చెబుతున్నారు.
 

More Related Stories