English   

షూటింగ్ లో ప్రమాదం...తల్లీ కూతుళ్ళు మృతి !

ranam
2019-03-30 09:45:14

నిన్న జరిగిన ఒక కన్నడ సినిమా షూటింగ్ లో జరిగిన ప్రమాదంలో తల్లీ కూతుళ్ళు చనిపోవడం కలకలం రేపుతోంది.  ఈ ఘటన శుక్రవారం కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో చోటుచేసుకుంది. నిన్న సాయంత్రం ఐదు గంటలకి రణం  చిత్రానికి సంబంధించిన షూట్ లో కారుతో స్టంట్ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా అది చూడటానికి పలువురు అక్కడికి వెళ్లారు. ఈ దృశ్య చిత్రీకరణ జరుగుతుండగా ఒక్కసారిగా షూటింగ్ లో వాడుతున్న సిలిండర్ పేలింది. దీంతో సిలిండర్ తాలూకా ఇనుప ముక్కలు తగిలి సుమన్ బాను (28), ఆమె కుమార్తె అయేషా బాను (5) అక్కడిక్కడే మరణించారు. గాయపడిన మరో మహిళను, మూడేండ్ల బాలికను ఆసుపత్రికి తరలించారు. ముందస్తు అనుమతి తీసుకోకుండా షూటింగ్ జరుపుతున్నట్లు తెలియగా, ఈ విషయం మీద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్పారు. పోలీసులు వెళ్లేసరికి అక్కడ సినిమా సిబ్బంది ఎవరూ లేరు.

More Related Stories