English   

బాలీవుడ్ ఈవెంట్ లో మెరిసిన విజయ్ దేవరకొండ !

Vijay-Devarakonda
2019-03-30 11:20:05

టాలీవుడ్ సెన్సేష‌నల్ స్టార్ విజ‌య్ దేవ‌ర‌కొండ త‌క్కువ టైంలో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. విజ‌య్‌ కి ముంబైలో జ‌రిగిన హిందుస్థాన్‌ టైమ్స్‌ ఇండియాస్‌ మోస్ట్ స్టైలిష్ అవార్డ్ ప్రధానం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో విజ‌య్ దేవ‌ర‌కొండ హాటెస్ట్ స్టైలిస్ట్ అవార్డు అందుకున్నారు. అయితే ఆయన ఆ కార్యక్రమం తర్వాత ఆయన కియారా అద్వానీతో క‌లిసి ఓ ఫోటో దిగారు. అలా దిగిన ప్ర‌స్తుతం వీరిద్ద‌రి ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. కియారా అద్వానీ ప్ర‌స్తుతం హిందీలో రూపొందుతున్న అర్జున్ రెడ్డి రీమేక్ చిత్రం క‌బీర్ సింగ్‌లో కథానాయికగా న‌టిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో నెటిజన్లు తెలుగు అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ప్రీతీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్‌ తోపాటు షారూఖ్‌ ఖాన్‌ దంపుతులు, అక్షయ్‌ కుమార్‌, రణవీర్‌ సింగ్‌, కరీనా కపూర్‌, కత్రినా కైఫ్‌ లతో కలిసి పాల్గొన్నారు. 
 

More Related Stories