English   

చిరంజీవి ఏమయ్యారు ?

Chiranjeevi
2019-03-30 12:37:09

ఏపీ సహా భారత్ మొత్తం ఎన్నికల సీజన్ నడుస్తోంది. ఈ నేపధ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి సూర్యుడి వేడితో పోటీ పడుతోంది. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది ప్రధాన పార్టీలకి మద్దతు తెలుపుతున్న నేపధ్యంలో సినీ ఇండస్ట్రీలో ఉన్న చిరంజీవి ప్రచారంలోకి ఇంకా ఎంట్రీ ఇవ్వ‌లేదు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉండగా ఆయన ప్రచారానికి వస్తారా రారా అని కాంగ్రెస్ కేడ‌ర్‌తోపాటు జనసేన అభిమానులు కూడా ఎదురు చూస్తున్నారు. నిజనికి  కాంగ్రెస్‌లో ఉన్న‌ట్టుగా క‌నిపిస్తున్నా తెలంగాణ ఎన్నిక‌ల స‌మ‌రంలో మాత్రం చిరంజీవి ఎక్క‌డా క‌నిపించ‌లేదు. ఇప్పుడు ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కూడా ఇదే వైఖ‌రిని అవ‌లంభిస్తున్నారని సమాచారం. తమ్ముడు పవన్ ప్రత్యేక కుంపటి పెట్టుకున్న తరుణంలో ఆయన ప్ర‌చారం చేస్తారా..? లేదా..? అన్న విషయం ఆస‌క్తిని పెంచుతోంది. చిరంజీవి త‌మ్ముళ్లు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, నాగ‌బాబు ఇద్ద‌రు కూడా జ‌న‌సేన నుంచి ఎన్నిక‌ల బ‌రిలో ఉన్న సంగ‌తి తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఈసారి వ్యూహాత్మకంగా ఆలోచించి షూటింగ్ పని మీద ఈరోజే రేపో జపాన్ ఫ్లైట్ ఎక్కనున్నారని సమాచారం. అలా చేస్తే అటు కాంగ్రెస్ అధిష్టానం నుండి ఇటు జనసేన, మెగా అభిమానుల నుండి తాకిడి నుండి తప్పించుకున్నట్టు చెబుతున్నారు. 
 

More Related Stories