English   

తల్లి కానున్న తేజ హీరోయిన్ !

Anita Hassanandani is Pregnant
2019-03-31 08:29:43

దర్శకుడు తేజ దర్శకత్వంలో ఉదయ కిరణ్ హీరోగా వచ్చిన నువ్వు నేను సినిమా ఎంత పెద్ద హిట్ అనే విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. యూత్ లవ్ నేపధ్యంలో తెరక్కిన ఈ సినిమా అప్పట్లో యూత్ లో యమా క్రేజ్. అయితే ఈ సినిమా ద్వారా హీరోయిన్‌గా పరిచయం అయింది అనిత. ఆ తర్వాత కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేసినా  సక్సెస్ కాకపోవడం పెద్దగా ఆఫర్లు కూడా రాకపోవడంతో ఆమె బాలీవుడ్ కి మకాం మార్చేసింది. ఇక సినిమాలు సెట్ కాకపోవడంతో హిందీ సీరియళ్లలో సెటిలయింది. ఈ మధ్యే తెలుగు వ్యాపారవేత్త రోహిత్ రెడ్డిని పెళ్లి చేసుకున్న ఈ భామ ఈ మధ్య ప్రెగ్నెంట్ అని, కవలలకు జన్మనివ్వనున్నారనే వార్తలు వినిపించాయి. ఇటీవల అనిత భర్త రోహిత్‌రెడ్డి ఒక వీడియోను షేర్‌చేస్తూ అనిత ప్రెగ్నెన్సీ విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇప్పుడు అనిత కూడా తాను కవలలకు జన్మనివ్వబోతున్నట్లు తెలిపింది. 

More Related Stories