English   

మళ్ళీ చెయ్యి జాడించిన బాలయ్య...ఈసారి కార్యకర్త మీదే !

Balakrishna Slaps TDP Activist in Hindupur Campaign
2019-03-31 08:46:17

నందమూరి బాలకృష్ణకి మీడియా వర్గాల్లో కానీ, బయట కానీ ఒక చెడ్డ పేరు ఉంది, అదేంటంటే అసలు బౌన్సర్స్ ని వాడని ఆయన ఒక్కో సందర్భంలో ఆయనే బౌన్సర్ అవతారం ఎత్తి తన ముందు కుప్పి గంతులు వేయాలనే వారి తాత తీస్తూ ఉంటాడు, ఆయన ఎలా కవర్ చేసుకున్నా అభిమానుల్లో మినహాయించి ఈ విషయంలో ఆయన మీద వ్యతిరేకత ఎడారువుతూనే ఉంది. తాజాగా మోజో టీవీ జర్నలిస్ట్ మీద రుబాబు చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అసలే ఎన్నికల మూడ్ లో ఉండడంతో ఎందుకు వచ్చిన తంటా అనుకున్నాడో లేదా పార్టీ పెద్దల నుండి కబురు వచ్చిందో తెలీదు కానీ సదరు జర్నలిస్ట్ కి సోషల్ మీడియా వేదికగానే క్షమాపణలు చెప్పారు.

ఆ విషయం అలా ఉంచితే తాజాగా అయన తెలుగుదేశం కార్యకర్త మీద చేయి చేసుకోగా అలిగిన సదరు వ్యల్తి వైకాపా ర్యాలీ వెంట పోవడం రాజకీయంగా చర్చనీయంసం అయ్యింది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో హిందూపురంలో బాలకృష్ణ ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నారు. నిన్న ఆయన ప్రచారంలో భాగంగా హిందూపురం సమీపంలోని సిరివరం గ్రామానికి వెళ్లారు. గ్రామంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతుండగా టీడీపీ కార్యకర్త రవికుమార్ సిరివరం చెరువుకు నీరు విడుదల చేయాలని కోరాడు. దీంతో బాలకృష్ణ ఆగ్రహంతో ఊగిపోయి రవికుమార్‌ను తోసేశారు. అతణ్ని బయటకు పంపాలని పోలీసులను ఆదేశించారు. బాలకృష్ణ ఆదేశాలతో రవికుమార్‌ ను పోలీసులు బయటకి పంపించారు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన రవికుమార్ వెంటనే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరాడు.

More Related Stories