English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ మూడు రోజుల కలెక్షన్స్ !

Lakshmi's NTR Box Office Collections Days 3
2019-03-31 09:28:54

రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ అనేక వివాదాల అనంతరం బయటకు వచ్చింది, అయితే తెలంగాణాలో అలాగే ఏపీ మినహా మిగతా చోట్ల మాత్రమే ఈ సినిమా రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా మొదటి రోజు అంచనాలకు మించి వసూల్ చేసిన నేపధ్యంలో రెండో రోజు మూడో రోజు కూడా జోరు చూపింది, సినిమా రెండో రోజు మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోలకి జనం క్యూ కట్టారు. నైట్ షోల బుకింగ్స్ కూడా మెల్లి మెల్లి గా జోరు అందుకున్నా ఐపీఎల్ ఎఫెక్ట్ పడింది, దాంతో ఓవరాల్ గా రోజు ని బాగానే ముగించినా కానీ కలెక్షన్స్ పరంగా కొద్దిగా స్లో డౌన్ అయిందని చెప్పొచ్చు. ఈ సినిమా మొదటి రోజు అయితే కొన్ని చోట్ల ఎన్టీఆర్ కధానాయకుడు, మహా నాయకుడు కలెక్షన్స్ ని కూడా దాటేసింది. టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా రెండో రోజున 70 లక్షల రేంజ్ షేర్ రాబట్టిందని ట్రేడ్ వర్గాల వారు భావిస్తున్నారు. ఇక మూడో రోజు  వరల్డ్ వైడ్ గా 50 లక్షల దగ్గర దగ్గర షేర్ రాబట్టిందని అంటున్నారు. ఈ విషయం మీద అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

 

More Related Stories