English   

చై కోసం బావా-బామ్మరుదులు !

Nagarjuna and Venkatesh for 'Majili' Pre-Release Event
2019-03-31 09:41:17

పెళ్లి అయ్యాక తొలిసారి అక్కినేని నాగచైతన్య, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా మజిలీ. న్నినుకోరి ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వచించిన ఈ సినిమాని షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు. గోపీ సుందర్ సంగీతం సమకూర్చిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఇప్పటికే ప్రమోషన్స్ ని ఒక రేంజ్ లో చేసుకుంటూ పోతున్న యూనిట్ ఈరోజు ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తోంది. హైదరాబాద్‌ ఫిల్మ్‌ నగర్‌ లో ఉన్న జేఏసీ కన్వెన్షన్ సెంటర్‌లో ఈరోజు రాత్రి జరిగే ఈ ప్రీ రిలీజ్ వేడుకకు ఇద్దరు స్టార్ హీరోలు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు.

ఆ ఇద్దరూ ఎవరో కాదండీ బాబు బావా బామ్మరుదులు అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్. ఈ మధ్య కాలంలో అంటే ఒక రెండు మూడేళ్ళుగా వీరిద్దరూ కలిసి ఒకే వేదికను పంచుకోలేదు. దీంతో ఇప్పుడు ఈ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మధ్యే వెంకటేష్ కూతురి పెళ్లి జరిగింది, ఈ వేడుకలో నాగ చైతన్య సమంతాలు కనిపించారు కానీ నాగార్జున అయితే కనపడలేదు.

More Related Stories