English   

సీత కాదు.. శూర్ఫణక...సీత టీజ‌ర్ టాక్ !

Kajal Aggarwal and Srinivas Bellamkonda starrer's teaser
2019-03-31 12:02:12

నేనే రాజు నేనే మంత్రి చిత్రంతో హిట్ కొట్టిన తేజ తర్వాత ఎన్టీఆర్ బయోపిక్ మొదలుపెట్టినా అది క్రిష్ చేతికి వెళ్ళింది. దీంతో ఆయన ప్ర‌స్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌, కాజ‌ల్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో సీత అనే సినిమా చేస్తున్నారు. ఏప్రిల్‌లో విడుద‌ల కానున్న ఈ సినిమా టీజ‌ర్ ఈరోజు విడుద‌ల చేశారు. ఈ టీజర్ చూస్తే కాస్త ఇంట్రస్టింగ్ గా అనిపిస్తుంది. నువ్వు మ‌ట్టికొట్టుకు పోతావే.. నువ్వు సీత‌వి కాదే.. శుర్ప‌ణ‌క‌వి అనే డైలాగ్ తో పాటు ఇంత కంత్రి పిల్లకి ఆ పేరు పెట్టారేమిటా అనుకున్నా.. ప‌క్క‌న శ్రీరాముడున్న సంగ‌తి అర్ధం కాలేదు వంటి లక్ష్మీ భూపాల రాసిన డైలాగ్స్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి. ముందు నుండి చేబుతున్నట్టుగానే ఈ సినిమా మొత్తం కాజ‌ల్ చుట్టూనే తిరగ‌నున్న‌ట్టు తెలుస్తుంది. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ మీద రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈ సినిమా కాజ‌ల్ కెరియ‌ర్‌లో మ‌రో మంచి హిట్ అవుతుందని అంటున్నారు.

More Related Stories